బంగాల్లో విషాదకర ఘటన జరిగింది. అమ్మ సెల్‌ఫోన్ తీసుకుందని (girl suicide news) ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లా బజ్బజ్ మున్సిపాలిటీ పరిధిలోని బలూర్‌ఘాట్‌లో శుభాష్ మండల్ భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. శుభాష్ స్థానికంగా జ్యూట్ మిల్లులో పనిచేస్తుంటాడు. ఆయన భార్య రాన్ మండల్ రోజువారీ కూలీ. ఇద్దరూ కలిసి ముగ్గురు పిల్లలను చదివించుకుంటున్నారు. కరోనా కారణంగా పిల్లలకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించగా.. సెల్‌ఫోన్ కొనిచ్చారు. ఇన్నిరోజులూ ఆ మొబైల్ సాయంతోనే పిల్లలు తరగతులకు హాజరయ్యారు.
కేసుల తగ్గుముఖంతో రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో కూతురు దగ్గర ఫోన్ తీసుకుంది రాన్ మండల్. తట్టుకోలేకపోయిన కూతురు.. గురువారం ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
ఇదీ చదవండి:గిరిజన బాలిక అపహరణ.. ఆపై అత్యాచారం