ETV Bharat / bharat

సోషల్​ మీడియా ఫేమ్​ కిడ్నాప్​, ఇద్దరు భార్యల మధ్య తీవ్ర పోటీ - తమిళనాడు లేటెస్ట్​ న్యూస్

సోషల్​ మీడియాలో ఫేమస్​ అయిన రమేశ్​ కిడ్నాప్​కు గురైనట్లు కేసు నమోదైంది. తన భర్తను కిడ్నాప్​ చేశారంటూ, రెండో భార్య ఆగస్టు 16న ఇంబవల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

dancer ramesh wife complaint
dancer ramesh wife complaint
author img

By

Published : Aug 17, 2022, 10:52 AM IST

తమిళనాడు చెన్నైలో సోషల్​ మీడియా ఫేమ్​ డ్యాన్సర్​ రమేశ్​ కిడ్నాప్​కు గురైనట్లు కేసు పెట్టింది అతడి రెండో భార్య. 50 ఏళ్ల రమేశ్​.. రోడ్డు పక్కన దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రమేశ్​కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ చేయాలనే ఆసక్తి ఉంది. దీంతో అతడు తన పేరును సైతం డ్యాన్సర్​ రమేశ్​గా మార్చుకున్నాడు. చిన్న కార్యక్రమాల్లో డ్యాన్స్​ చేస్తుండేవాడు. ఈక్రమంలోనే తన స్నేహితుల సలహాతో డ్యాన్స్ చేస్తూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేశాడు. తనదైన స్టైల్​లో డ్యాన్స్ చేస్తున్న రమేశ్​ సోషల్​ మీడియాలో పాపులర్​ అయ్యాడు. టీవీల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోల్లో సైతం పాల్గొన్నాడు. సోషల్​ మీడియాలో పాపులర్​గా మారడం వల్ల రమేశ్​.. ఆర్థికంగా కుదురుకున్నాడు.

అయితే, ఈ సమయంలోనే తన భర్తను కిడ్నాప్​ చేశారంటూ.. రెండో భార్య ఆగస్టు 16న ఇంబవల్లి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆగస్టు 11న రంజిత్​, కుమార్​, జై, రాజ్​కుమార్​ వచ్చి.. షూట్​ ఉందంటూ తన భర్తను తీసుకెళ్లగా.. మళ్లీ తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తకు డ్రగ్స్ ఇచ్చి.. మొదటి భార్య చిత్రనే కిడ్నాప్​ చేసిందని ఆరోపించింది. ఆమె ఇంటికి వెళ్తే.. తనను చంపుతానంటూ బెదిరించిందని చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మొదటి భార్య చిత్రను విచారించగా.. భర్తే తన వద్దకు వచ్చాడని బదులిచ్చింది. తాను రమేశ్​ 24 ఏళ్ల క్రితమే వివాహం చేసుకున్నామని.. 10 ఏళ్ల కింద విడిపోయామని చెప్పింది. తాజాగా కూతురు వివాహానికి వచ్చిన రమేశ్​.. మనసు మార్చుకుని ఇక్కడే ఉండిపోయాడని తెలిపింది. అతడిని ఎవరూ కిడ్నాప్​ చేయలేదని వెల్లడించింది. ఈ కేసును పులియతోప్​ పోలీస్​ స్టేషన్​కు బదిలీ చేయగా.. దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: ఒకే ఇంట్లో ఆరు మృతదేహాలు, ఏం జరిగింది

తాజ్​ ఎక్స్​ప్రెస్​లో​ బాంబు కలకలం, రెండు గంటలు వెతికిన తర్వాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.