Step Mother Burnt Child Hands: కర్ణాటకలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆహారం పెట్టమని అడిగినందుకు ఓ చిన్నారిపై దారుణానికి ఒడిగట్టింది సవతి తల్లి. కొంచెం కూడా కనికరం లేకుండా చిన్నారి చేతులుపై వాతలు పెట్టింది. అంతటితో ఆగకుండా మంచానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేసింది. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది.. కలబురగి జిల్లాలోని తండా గ్రామానికి చెందిన తిప్పన్న భార్య ఇటీవలే చనిపోయింది. దీంతో తన నాలుగేళ్ల పిల్లవాడిని చూసుకునేందుకు మారెమ్మ అనే మహిళను రెండో వివాహం పెళ్లి చేసుకున్నాడు. తిప్పన్న ఇంట్లో ఉన్నప్పుడు మారెమ్మ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునేది. అయితే వేరే పనిమీద తిప్పన్న ఇటీవలే పుణెకు వెళ్లాడు. ఇదే అదనుగా తీసుకున్న సవతి తల్లి బాలుడిపై దారుణానికి ఒడిగట్టింది. మూడు రోజులుగా చిన్నారి ఇంటి నుంచి బయటకు రాకపోవడం వల్ల అనుమానం వచ్చిన స్థానికులు తిప్పన్న ఇంట్లోకి వెళ్లారు. చిన్నారిని మంచానికి కట్టేసి ఉండటాన్ని చూసిన వారు.. తాడు విప్పి రక్షణ కల్పించారు. చిన్నారి ఏడుపు చూసిన స్థానికులు ఆమెపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
భర్తను చంపడానికి ప్లాన్ చేసిన భార్య.. ఇరుగుపొరుగు వారితో చీటీ కట్టించి రూ. 25 లక్షలు నష్టపోయింది ఓ గృహిణి. దీంతో ఆమెను తన భర్త తిట్టి.. భార్య చేసిన అప్పులు తీర్చాడు. అయినా భర్త మందలింపులతో విసిగిపోయిన భార్య అతడ్ని హత్యకు చేసేందుకు ప్లాన్ చేసింది. కానీ విఫలమై జైలు పాలైంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ఈ హత్యాయత్నం కేసులో నిందితుల్ని అరెస్టు చేశారు.
ఏం జరిగిందంటే?.. బెంగళూరులోని భువనేశ్వర పట్టణంలో నివాసం ఉంటున్న మమత (44) ఇరుగుపొరుగు వారితో చీటీ డబ్బులు కట్టించింది. వోచర్ నడిపిన వ్యక్తి.. మొత్తం డబ్బుతో పరారయ్యాడు. దీంతో తమ డబ్బులు ఇవ్వమని ఇరుగుపొరుగు వారు మమతను వేధించడం మొదలుపెట్టారు. వారి వేధింపుల నుంచి బయటపడేయడానికి భర్త అప్పులు తీర్చాడు. కానీ, రోజూ భార్యను దారుణంగా తిట్టేవాడు. ఈ విషయాన్ని మమత తన స్నేహితురాలు తస్లీమాకు చెప్పింది. తస్లీమా సలహాతో బెంగళూరుకు చెందిన సయ్యద్ నహీమ్తో కలిసి మమత.. ఆమె భర్త హత్యకు ప్లాన్ చేసింది. కానీ హత్యాయత్నం విఫలమైంది. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు వచ్చిన కారు నంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీశారు. ప్రమేయమున్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: పబ్జీ ఆడొద్దన్న తల్లిని కాల్చి చంపిన బాలుడు.. లూడోలో నష్టపోయి ఆత్మహత్య
''కుడి చేయి నరికేస్తే ఏంటి? ఎడమ చేయి ఉందిగా!'.. ఆ నర్స్ తెగువకు సలాం'