Srivari Salakatla Brahmotsavam 2023 Started : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం వేళ వేదమంత్రాలు, మంగళ వాద్యాలు నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటల నుంచి మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనంపై ( Today China Sesha Vahana Seva at Tirumala) .. రాత్రికి హంస వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
TTD Brahmotsavam 2023 : శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంగరంగ వైభవంగా ప్రారంభయ్యాయి.సోమవారం సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంతో ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మొదటిగా సంప్రదాయ బద్దంగా బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద చేరుకొని దర్శనం చేసుకున్నారు. అనంతరం సీఎం జగన్.. బేడి ఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గర్భాలయంలోకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎంకు రంగనాయకుల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు, పండితులు వేదాశీర్వచనం అందజేశారు. 2024 సంవత్సరం టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి విడుదల చేశారు.
Tirumala Brahmotsavam 2023 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Srivari Salakatla Brahmotsavam) భాగంగా తొలి రోజున మలయప్ప స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై విహరించారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు సాంస్కృతిక నాట్యాల నడుమ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. పెద్ద శేషు అంటే.. నాగులలో అత్యంత శ్రేష్ఠుడైన ఆదిశేషువు అని అర్థం. ఆదిశేషునిపై శయనించే... శ్రీ మహవిష్ణువు బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆ వాహనంపై విహరిస్తారు. పెద్ద శేష వాహనంపై ఉన్న మలయప్ప స్వామిని వీక్షిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో స్వామి వారిని వీక్షించేందుకు వచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు జియో ట్యాగులు వేస్తున్నారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. స్వయంగా ప్రొటోకాల్ ప్రముఖులనే అనుమతించనున్నారు. చంటిపిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలనూ రద్దు చేశారు.
Tirumala Brahmotsavalu Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏయే రోజుల్లో ఏయే వాహన సేవంటే..