ETV Bharat / bharat

margadarshi : మార్గదర్శిపై చర్చకు సిద్ధం.. వేదిక ఎక్కడైనా సరే..! ఉండవల్లికి టీడీపీ సవాల్ - tdp

margadarshi : మార్గదర్శిపై చర్చకు తాము సిద్ధమని తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పష్టం చేశారు. చందా దారులకు నష్టం జరగబోతోందంటూ ఉండవల్లి చేస్తున్న వ్యాఖ్యలపై మే 14న హైదరాబాద్ లో చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. వేదిక ఎక్కడైనా సరే.. వాస్తవాలను ప్రజల ముందుంచడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. రాజకీయ అంశాలను వ్యవస్థలకు ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని జీవీ పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 27, 2023, 11:49 AM IST

Updated : Apr 27, 2023, 12:29 PM IST

margadarshi : మార్గదర్శిపై చర్చకు తాము సిద్ధమని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి స్పష్టం చేశారు. మే 14న హైదరాబాద్ లో ఉండవల్లితో చర్చించేందుకు సిద్ధం అని తెలిపారు. టీడీపీ కార్యాలయమే కాదు.. వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చేందుకైనా తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. మార్గదర్శిలో ఏదో జరుగుతోందని, చందాదారులకు ఏదో నష్టం జరగబోతోందని హడావిడి చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని టీడీపీ నేత జీవీ రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్‌ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలోనైనా చర్చకు సిద్ధం అని ఆయన వెల్లడించారు. వేదిక ఎక్కడనేది కాదన్న జీవీ.. చర్చే ముఖ్యమని తెలిపారు. ఇందులో బలాబలాలకు సంబంధం లేదని, వాస్తవాలను ప్రజలకు తెలియాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. మార్గదర్శి విషయంలో బాధితులెవరూ లేరన్న ఆయన... ఫిర్యాదుదారులు కూడా లేరని స్పష్టం చేశారు. ప్రతీ అంశంపైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టం ఏం చెబుతుంది.. కోర్టులు ఏమంటున్నాయన్న దానిపైనా చర్చించాలని పేర్కొన్నారు. ఏం మాట్లాడినా దానికి ఆధారాలు ఉండాలన్న ఆయన.. ఆధారాలు లేకుండా మాట్లాడితే సరిపోదని అన్నారు. అన్ని ఆధారాలతో చర్చకు వస్తాం.. ఎవరు మాట్లాడినా సబ్జెక్ట్‌పైనే చర్చించాలని, అడ్డగోలు వాదనలతో కాలయాపన మంచిది కాదని సూచించారు. ఉండవల్లితో చర్చకు మా పార్టీ తరఫున ఎవరు వచ్చినా మాట్లాడగలరు.. పార్టీ సూచన మేరకు తాను వస్తున్నానని తెలిపారు.

రాష్ట్రాభివృద్ధి టీడీపీ లక్ష్యం... అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనే టీడీపీ ఎప్పుడూ కోరుకుంటోందని జీవీ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగావకాశాలు వస్తాయని భావిస్తామని, రాష్ట్రంలోని ఏ పరిశ్రమ, సంస్థకు ఇబ్బంది వచ్చినా స్పందిస్తామని తెలిపారు. ఈ విషయంలో భారతీ సిమెంట్స్‌ .. హెరిటేజ్‌.. ఏదైనా సరే... అండగా ఉంటామని అన్నారు. ప్రభుత్వం దురుద్దేశంతో కక్ష కట్టి వేధిస్తే టీడీపీ పోరాడుతుందని చెప్పారు.

కక్ష సాధింపు చర్యలు సరికాదు... ప్రతిపక్షాలు, మీడియా.. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతాయని, తప్పులు చేస్తున్నాగానీ పత్రికలు ఏమీ రాయకూడదంటే ఎలా? అని జీవీ ప్రశ్నించారు. జగన్‌ సభలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఈనాడు పత్రిక రాయట్లేదా అని గుర్తు చేశారు. స్కీమ్‌లు పెట్టినప్పుడు రాస్తే ఒప్పు అయినప్పుడు, లోపాలు మాత్రం రాయకూడదన్నట్లు వ్యవహారం ఉంటే ఎలా అని దుయ్యబట్టారు. తాడేపల్లి నుంచి పంపించే నోట్‌ యథాతథంగా పత్రికల్లో రాయాలంటే ఎలా? అని ఆయన మండిపడ్డారు. మీకు ఇష్టమొచ్చినట్లు రాయకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతారా! అని జీవీ రెడ్డి ప్రశ్నించారు.

భయాందోళనకు గురి చేస్తే ఒరిగేదేంటి..? రాష్ట్రానికి ఆదాయం పోయినా ఈ ప్రభుత్వానికి పట్టదని, కక్షసాధింపులే ముఖ్యమని విమర్శించారు. ఎదైనా ఇబ్బంది ఉంటే, రాజకీయ పరంగా చూసుకోవాలి గానీ.. వ్యవస్థలపై పడతారా?.. కంపెనీలను భయాందోళనకు గురిచేస్తే ఒరిగేదేంటి? అని అభిప్రాయపడ్డారు. ఉండవల్లితో చర్చకు మా పార్టీ తరఫున ఎవరు వచ్చినా మాట్లాడగలరు... పార్టీ తరఫున నన్ను చర్చకు వెళ్లమన్నారు అని జీవీ రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 27, 2023, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.