ETV Bharat / bharat

జైల్లో అతడి మరణంతోనే స్టాలిన్​కు పునర్జన్మ! - స్టాలిన్​ గురించి కొన్ని నిజాలు

ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయితేనేం.. సామాన్యుడిలా ప్రజలతో మమేకమవడం ఆయన నైజం. అనూహ్యంగా తారసపడి వారి సమస్యలు తెలుసుకుంటారు. తన వాక్చాతుర్యంతో ప్రతిపక్ష నేతలను సైతం కట్టిపడేస్తారు. ప్రజా శ్రేయస్సు కోసం ఎంత కఠిన నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడరు. ఆయనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన.. సీఎం పీఠాన్ని అధిరోహించినప్పటికీ మూలాలు మరిచిపోలేదంటే అతిశయోక్తి కాదు. కావాల్సిన వారికి చేయూతనందిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న డీఎంకే అధినేత గురించి మరిన్ని విషయాలు చదివేయండి..

chief minister MK Stalin
స్టాలిన్
author img

By

Published : Sep 19, 2021, 2:58 PM IST

'అతనేమన్నా పేదింట పుట్టాడా... తండ్రి పంచన పార్టీ పదవులు చేపట్టి పెద్దాయన పోయాక ముఖ్యమంత్రి అయ్యాడు' అంటూ ఒక్క మాటలో కొట్టిపారేయొచ్చు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రస్థానాన్ని ఎవరైనా. అదే నిజమైతే... సీఎం పదవి చేపట్టిన మూణ్ణెల్లకే దేశంలోనే 'ది బెస్ట్‌' ముఖ్యమంత్రిగా ప్రశంసలు అందుకునేవారు కాదు స్టాలిన్‌. 'అటు పరిణతీ, ఇటు కారుణ్యం రెండూ ఉన్నవారు' అన్న ట్యాగ్‌లైన్‌ సొంతం చేసుకునేవారూ కాదు. జీవితంలో ఎంతో పోరాడినవాళ్లకి తప్ప అందరికీ అలాంటి ప్రశంసలూ ప్రఖ్యాతీ దక్కవు. స్టాలిన్‌ సాగించిన ఆ పోరాటాల ప్రస్థానమిది..

chief minister MK Stalin
డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్

పెళ్ళి కోసం కొత్తగా వెల్లవేసుకుని సింగారించుకున్న గోడల జిలుగులు... ఇంకా వసివాడలేదు. బంతిపూల తోరణాల సువాసన తగ్గనేలేదు. అంతలోనే... ఆ అరెస్టు చోటుచేసుకుంది. పెళ్ళినాటికి స్టాలిన్‌కి 23 ఏళ్లైతే... దుర్గ వయసు 16. తొలినాటి సిగ్గూ, బిడియాలకితోడు చుట్టూ ఎప్పుడూ ఉమ్మడి కుటుంబంలోని పిల్లాజెల్లా సందడి ఉండటంతో ఆ ఇద్దరూ మాట్లాడుకోవడమే గగనం. ఒకరిపైన ఒకరు కళ్లతోనే ప్రేమని వ్యక్తం చేసుకోవడం అప్పుడప్పుడే అలవాటు చేసుకుంటూ ఉండగానే- ఆ అరెస్టు.. ఎమర్జెన్సీ రోజులవి. స్టాలిన్‌ తండ్రి కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దుచేశారు నాటి ప్రధాని ఇందిరాగాంధీ. ఆ పార్టీ నేతల్ని జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. ఆ జాబితాలో కరుణానిధి తనయుడు స్టాలిన్‌ పేరునీ చేర్చారు. ఇంటికొచ్చిన అధికారులకి 'మావాడు మధురాంతకం వెళ్లాడు, రాగానే నేను మీకు చెబుతాను' అని మాటిచ్చారు కరుణానిధి. మధురాంతకంలో పార్టీ ప్రచారం కోసం ఓ నాటకం వేయడానికి వెళ్లారు స్టాలిన్‌. అలాంటి నాటకాలూ, ఎన్నికలప్పుడు చేసే చిన్నాచితకా ప్రచారాలూ... ఇవే అప్పటిదాకా స్టాలిన్‌ దృష్టిలో రాజకీయాలంటే. కానీ ఆ నాటకం వేసి ఇంటికొచ్చాక చోటుచేసుకున్న పరిణామాలు అతని జీవితాన్నే మార్చేశాయి. వాటిల్లోకి వెళ్లే ముందు...

అంత నెమ్మదస్తుడు...

కరుణానిధీ- దయాళుల రెండోకొడుకు స్టాలిన్‌. పెద్ద కొడుకు అళగిరి. 'నేను రాజకీయాల్లో వీరంగం వేస్తున్నప్పుడు పుట్టినవాడు అళగిరి. కాస్త విచక్షణా వివేకమూ వచ్చాక జన్మించినవాడు స్టాలిన్‌. ఆ ఇద్దరూ వాటికి ప్రతిరూపాలు' అంటుండేవారు కరుణానిధి. ఈ ఇద్దరు అన్నదమ్ములకి సెల్వి అనే చెల్లెలూ, తమిళరసు అనే తమ్ముడూ ఉన్నారు. ఆ ఇంట వీళ్లే కాకుండా కరుణానిధి అక్కచెల్లెళ్లూ, వాళ్ల పిల్లలూ, కరుణానిధి మొదటి భార్య పద్మావతి కొడుకు ముత్తు... ఇలా చాలా మందే ఉండేవారు. వీళ్లందరిలోకల్లా అతినెమ్మదస్తుడు స్టాలిన్‌. 'మావాడికి తెల్లబట్టలు వేసి ఆడుకొమ్మని పంపిస్తే... సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ఆ బట్టలకి ఒక్క మరకా అంటదు, చిన్న మడతా పడదు. వాడంత నెమ్మది' అంటారు దయాళమ్మ మురిపెంగా. చదువుల్లో పెద్దగా రాణించకపోయినా... హాకీ, క్రికెట్‌లపైన మాత్రం బాగా ఆసక్తి చూపేవారు స్టాలిన్‌. ఆ క్రీడాసక్తే అతనిలో బృందస్ఫూర్తిని నింపింది. మెల్లగా చిన్నచిన్న సభల్లో పాల్గొని ఎంతోకొంత ప్రసంగించడం నేర్చుకున్నారు. అయినా... ఎప్పుడూ రాజకీయాలే తన జీవితం అనుకోలేదు. డిగ్రీ తర్వాత సొంతంగా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ నడపడం మొదలుపెట్టారు. మంచి రూపమూ, చక్కటి నవ్వూ ఉన్నవాడు కాబట్టి... పార్టీ ప్రచార నాటకాల్లో నటిస్తుండేవారు. ఆ నేపథ్యంలోనే దుర్గతో పెళ్లైంది. వాళ్ల తొలినాటి ముచ్చట్ల నడుమనే... ఎమర్జెన్సీ పరిస్థితులొచ్చాయి. పోలీసులకిచ్చిన మాటప్రకారం స్టాలిన్‌ ఇంటికిరాగానే అతణ్ణి అప్పగించారు కరుణానిధి. వాళ్లతో వెళుతున్న స్టాలిన్‌నీ, ఏడుస్తూ బేలగా నిల్చున్న దుర్గనీ చూశాక... ఎప్పుడూ నిబ్బరంగా ఉండే కరుణానిధికీ కన్నీళ్లు ఆగలేదు.

చావు తప్పి...

స్టాలిన్‌ని అరెస్టు చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళుతున్నారో ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. రోజంతా జీపులోనే తిప్పి.. అర్ధరాత్రి చెన్నై సెంట్రల్‌ జైలులోని ప్రత్యేక సెల్‌లోకి తీసుకెళ్లారు. ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకన్న విషయం అటుంచి.. చిన్నకుర్రాడన్న జాలికూడా లేకుండా బట్టలూడదీసి లాఠీలతో చితకబాదారు. 'నేను ఇక పార్టీ కోసం పనిచేయను' అని రాసివ్వమన్నారు. ఒప్పుకోకపోవడంతో... పోలీసులు తమ క్రౌర్యానికి కొత్త కోరలు తొడిగారు. జైలులోని జీవితఖైదీల చేత కొట్టించారు. ఇనుపబూట్లు తొడిగి మరీ తొక్కించారు. అలా ఒకడు స్టాలిన్‌ కుడిచేయిని తొక్కి... భుజందాకా విసురుగా లాగడంతో అంగుళం మందాన కండలేచి వచ్చింది. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన మరో ఖైదీ, మాజీ మేయర్‌ చిట్టిబాబు పొట్టపైన తొక్కితే ఆయన అప్పటికప్పుడే రక్తం కక్కుకుని పడిపోయాడు. అతణ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసినా ఫలితంలేక చనిపోయాడు. ఓ రకంగా అతని మరణమే స్టాలిన్‌ని బతికించిందని చెప్పాలి. చిట్టిబాబు మృత్యువు తర్వాత పోలీసులు హింసాకాండని ఆపారు కానీ ఇతరత్రా ఆగడాలు ఆగలేదు. రోజుకోసారి గంజినీళ్లిచ్చి తాగుతున్నంతలోనే మట్టిపోసేవారట! నెలరోజుల తర్వాతే స్టాలిన్‌ని చూడటానికి తల్లినీ భార్యనీ అనుమతించారు. వాళ్లు చూసొచ్చిన వారం తర్వాత స్టాలిన్‌కి తీవ్రంగా వాంతులయ్యాయి. అతనికి అపెండిసైటిస్‌ అని తేల్చిన వైద్యులు వెంటనే ఆపరేషన్‌ చేయాలని చెబితే అందుకు ససేమిరా అన్నారట పోలీసులు. ప్రాణాపాయమని నచ్చచెప్పి వైద్యులే చొరవ తీసుకుని ఆసుపత్రిలో చేర్చారు. ఆపరేషన్‌ జరిగిన గంటలోనే తిరిగి జైలుకి తీసుకెళ్లారట పోలీసులు. ఆ నిస్సత్తువకి, శ్వాస సమస్యా తోడై దినదిన గండమన్నట్టు జైల్లో ఏడాది గడిపారు. ఆ సంవత్సరకాలమే స్టాలిన్‌ రాజకీయ జీవితానికి గట్టి పునాదిగా మారింది. ఎమర్జెన్సీ తర్వాత విడుదలైన స్టాలిన్‌ని.. పార్టీ కార్యకర్తలందరూ ఓ స్టార్‌గానే చూడటం మొదలుపెట్టారు. అతణ్ని డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌లోకి చేర్చుకోవాలని ప్రతిపాదించారు. దానికి అభ్యంతరం చెప్పిన తొలివ్యక్తి.... స్టాలిన్‌ తండ్రి కరుణానిధి!

chief minister MK Stalin
కుటుంబంతో స్టాలిన్

తల్లే తొలి మద్దతుదారు!

స్టాలిన్‌ అర్భకంగా ఉండటమే కాదు... అంత మాటకారి కూడా కాకపోవడం వల్ల కరుణానిధి అతణ్ణి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎదుటివాళ్ల కష్టాన్ని అర్థంచేసుకోగల అతని సున్నితత్వం కూడా ఓ నాయకత్వ లక్షణమేనని అర్థంచేసుకున్న తొలి వ్యక్తి వాళ్లమ్మ దయాళు. అతను ప్రచారాలకి వెళ్లడానికీ ఆమెదే ప్రధాన ప్రోత్సాహం. స్టాలిన్‌ రాజకీయఖైదీగా ఏడాది జైలు జీవితం గడిపి వచ్చాక... పార్టీలో అతనికి మంచి స్థానం కల్పించాలని కోరుకున్నారామె. స్టాలిన్‌ని జనరల్‌ కౌన్సిల్‌లోకి తీసుకునేందుకు కరుణానిధి ఇష్టపడకపోయినా పార్టీలోని ఇతర పెద్దలు పట్టుబట్టడంతో సరేననక తప్పలేదు. అది ప్రారంభం. తనదైన సహనం, స్నేహశీలత, ఎవర్నైనా కలుపుకుని పోగల గుణంతో యువ కార్యకర్తల్ని తనవైపు తిప్పుకున్నారు స్టాలిన్‌. నిజానికి స్టాలిన్‌ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన కాలం... డీఎంకేకి అత్యంత గడ్డుకాలమని చెప్పాలి. ఎందుకంటే...

ఎంజీఆర్‌-జయలలిత...

నాటి సూపర్‌స్టార్‌ ఎంజీఆర్‌కున్న కరిష్మా కారణంగా దాదాపు రెండు దశాబ్దాలపాటు అధికారానికి దూరంగా ఉండిపోయింది డీఎంకే. స్టాలిన్‌ 1984లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు కూడా. 1989లో ఎంజీఆర్‌ మరణం తర్వాత... పార్టీ అధికారంలోకి రావడమే కాదు తానూ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రంగంలోకి వచ్చిన జయలలిత దాడుల్నుంచి తనని కాచుకోవడమే స్టాలిన్‌కి పెద్ద సవాలుగా మారింది. ఇక, అతనికున్న రెండో సమస్య అళగిరి. పార్టీలో స్టాలిన్‌కి పెరుగుతున్న పరపతిని సహించని అళగిరి మొదటి నుంచే యుద్ధభేరి మోగిస్తుండేవారు. దాంతో కరుణానిధి 1989లో అధికారంలోకి వచ్చినా ఎమ్మెల్యేగా గెలిచిన స్టాలిన్‌కి ఏ బాధ్యతలూ అప్పగించలేదు. 1996లో డీఎంకే మళ్లీ పాలనాపగ్గాలు చేపట్టాక కానీ కరుణ ధైర్యం చేయలేకపోయారు. అది కూడా చెన్నై నగరానికి మేయర్‌గా పోటీచేసి తనని తాను నిరూపించుకోవాలన్న సవాలుని స్టాలిన్‌ ముందుంచారు. దాన్ని స్వీకరించి ఎన్నికల్లో గెలిచి చూపిన స్టాలిన్‌... ది బెస్ట్‌ మేయర్‌గా ప్రశంసలందుకున్నారు. 2001లో రాష్ట్రమంతా డీఎంకే ఓడిపోయినా, చెన్నై నగరంలో తనే మళ్లీ మేయర్‌గా గెలిచారు. కానీ జయలలిత ఆడిన రాజకీయ చదరంగంలో మేయర్‌ పదవిని కోల్పోయి... అరెస్టు కూడా అయ్యారు. అప్పటి నుంచి జయలలితని నేరుగా ఢీకొనడం మొదలుపెట్టారు స్టాలిన్‌. అప్పుడు తిన్న ఢక్కామొక్కీలతో డీఎంకేలో తిరుగులేని నేతగా మారాడు. ఆ తర్వాతకానీ వాళ్ల నాన్నకి అతనిపైన నమ్మకం రాలేదు. 2006లో స్టాలిన్‌కి మంత్రి పదవి ఇవ్వడంతోపాటు డిప్యుటీ సీఎంగానూ ప్రకటించారు. ఇవన్నీ నచ్చక... అళగిరి తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో పార్టీ 2011లోనూ, 2016లోనూ జయలలిత చేతిలో చిత్తుగా ఓడిపోయింది!

గెలిపించారు...

అప్పటికి కరుణానిధి గొంతు కోల్పోయి రాజకీయాల్నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. అనంతరం చోటుచేసుకున్న జయలలిత మరణం... స్టాలిన్‌కి పెద్ద పరీక్షనే పెట్టింది. అది స్టాలిన్‌ శక్తిసామర్థ్యాలని ప్రశ్నించే పరీక్ష కాదు... ఆయన నైతికతకి పెట్టిన పరీక్ష. జయలలిత చనిపోవడంతో పాలక అన్నాడీఎంకే రెండు ముక్కలుగా చీలింది. వాళ్లలో ఓ 20 మందిని తనవైపు లాక్కున్నా... 98 సీట్లున్న డీఎంకే కూటమి అధికారంలోకి సులువుగా వచ్చేదేకానీ... అందుకు ససేమిరా అన్నారు స్టాలిన్‌. 'ప్రజలిస్తేనే అధికారం. ఇలా దొడ్డిదార్లు మనకొద్దు' అని ప్రకటించారు. ఇంతలో 2018 ఆగస్టులో కరుణానిధి కన్నుమూశారు. 2019 పార్లమెంటు ఎన్నికలొచ్చాయి. అప్పటికే అళగిరి బద్ధశత్రువైపోయారు. ఆ నేపథ్యంలో తమ కూటమిని పార్లమెంటు ఎన్నికల్లోకి ఒంటిచేత్తో నడిపించిన స్టాలిన్‌కి దాదాపు అన్ని సీట్లూ అప్పగించేశారు ప్రజలు. ఆ తర్వాత... 2021 మే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు లాంఛనమే అయింది!

ఓ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల్లో దాని ప్రభ కొద్దికొద్దిగా తగ్గడం చాలా మామూలు. తమిళనాడులో ఇందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల నాటికీ ఇప్పటికీ ప్రజల్లో స్టాలిన్‌ పట్ల ఆదరణ గణనీయంగా పెరిగిందని చెబుతున్నాయి సర్వేలు. పనితీరు పరంగా ఆయనే నంబర్‌ వన్‌ అని కితాబిస్తున్నాయి. పాలనని చేతుల్లోకి తీసుకున్న మొదటి రోజే కొవిడ్‌పైన వార్‌ రూమ్‌ ఏర్పాటుచేసి తానే స్వయంగా పర్యవేక్షించారు. 8 శాతం ఉన్న వ్యాక్సిన్‌ల వృథాని పూర్తిగా అరికట్టి... కొత్త రికార్డు సృష్టించారు. అంతేకాదు, 'ఇంటింటికీ వైద్యం' పేరుతో 45 ఏళ్లు దాటినవాళ్లందరికీ- ఇంటికే వచ్చి బీపీ షుగర్‌లు చెక్‌ చేయడం ఈసీజీలూ డయాలసిస్‌లూ చేయడం వంటి పథకాలు ప్రజల్ని మెప్పిస్తున్నాయి.

ఆ సంస్కారం...

వీటన్నింటికీ మించిన మరో విషయం.. స్టాలిన్‌ పాలనలోకి వచ్చాకే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్ష నేతల్ని వ్యక్తిగతంగా తూలనాడలేదు. శాసనసభలో గత ప్రభుత్వంలో మంచిపనులు చేసిన ప్రతిపక్షనేతల్ని స్వయంగా మెచ్చుకున్నారు. తమిళనాడు శాసనసభలో గత 50 ఏళ్లలో ఎన్నడూ కనిపించని దృశ్యాలివన్నీ. అంతేకాదు అటు కరుణానిధి ఉన్నా ఇటు జయలలిత ఉన్నా... పాలన పూర్తిగా వాళ్ల చుట్టే తిరిగేది. కానీ స్టాలిన్‌... తన చుట్టూ బలమైన మంత్రుల్నీ, అధికారుల్నీ నియమించుకుని వాళ్లకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తాను కేవలం ఓ సమన్వయకర్తగానే ఉంటున్నారు.ఫలితం- ఐదేళ్లపాటు అభివృద్ధి కుంటుపడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఆ పరుగు పందెంలో బలంగా నిలబెట్టారు..!

మరికొన్ని...

స్టాలిన్‌ 1984-89 మధ్య రెండు సినిమాల్లో నటించారు. ఒకదాంట్లో కార్తిక్‌కీ, మరో దాంట్లో విజయ్‌కాంత్‌కీ స్నేహితుడిగా పూర్తి నిడివి ఉన్న పాత్రలో కనిపించారు.

  • నాస్తికుడే కానీ... మరీ పిడివాది కాదు. ప్రచారాలప్పుడు ఎవరైనా దేవుడి హారతులిస్తే తీసుకుంటారు. భార్య దుర్గ తిరుపతి వేంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు..!
  • రోజూ గంట యోగా, గంట వెయిట్‌ ఎక్సర్‌సైజులు చేస్తారు. 68 ఏళ్ల వయసులోనూ... ఫిట్‌గా కనపడటానికి అదే కారణమంటారు.
  • స్టాలిన్‌ తెలుగు బాగా అర్థం చేసుకుంటారు... ఆయన క్యాబినెట్‌లో ఐదుగురు తెలుగు మంత్రులున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.