ETV Bharat / bharat

అంధుల కోసం హైటెక్ షూస్.. దారికి అడ్డొస్తే అంతే! - అంధుల కోసం బూట్లు

Special shoe for blind: అంధుల కోసం సరికొత్త పరికరాన్ని రూపొందించాడు ఓ విద్యార్థి. వారు ముందుకు నడుస్తున్నప్పుడు ఎదురుగా ఏమైనా అడ్డు వస్తే వెంటనే అప్రమత్తం చేసేలా సెన్సార్‌తో కూడిన బూట్లను తయారుచేశాడు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసి ప్రజలకు అవసరమయ్యే పరికరాలు రూపొందిస్తానంటున్నాడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ అసోం చిన్నోడు.

special shoe for blind 9th standard Assam student designs
అంధుల కోసం హైటెక్ షూస్
author img

By

Published : Apr 5, 2022, 10:47 AM IST

అంధుల కోసం హైటెక్ షూస్.. దారికి అడ్డొస్తే అంతే!

Special shoe for blind: అసోంకు చెందిన కుర్రాడు.. శాస్త్రవేత్తలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంధుల కోసం ఓ సరికొత్త పరికరాన్ని రూపొందించాడు. చూపు కోల్పోయిన వారు నడుస్తున్నప్పుడు.. అనుక్షణం అప్రమత్తం చేసేలా సెన్సార్‌తో కూడిన బూట్లను తయారుచేశాడు అంకురిత్ కర్మాకర్ అనే విద్యార్థి. రోడ్డుపై ఎదురుగా ఏదైనా వాహనం కానీ, వ్యక్తులు కానీ వచ్చినప్పుడు బూటులో ఏర్పాటు చేసిన సెన్సార్‌ పెద్దగా శబ్దాలు చేస్తుంది. దీంతో సదరు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

special shoe for blind 9th standard Assam student designs
స్మార్ట్ షూస్

తల్లితో అంకురిత్

ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న అంకురిత్‌... భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అంటున్నాడు. తగిన ప్రోత్సాహం అందిస్తే ఈ పరికరాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తానని చెబుతున్నాడు. గొప్ప శాస్త్రవేత్త కావడం తన లక్ష్యమని తెలిపాడు. చూపుకోల్పోయిన వారి కోసం సరికొత్త పరికరాన్ని తయారు చేసిన అంకురిత్‌.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

స్మార్ట్ షూను పరీక్షిస్తూ..

ఇదీ చదవండి: మంటల్లో సాహసం.. పసిబిడ్డతో పరిగెత్తిన కానిస్టేబుల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.