అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలని ఆమె సొంత గ్రామంలోని ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడు తిరువరూర్ జిల్లాలోని పైంగనాడు తులసేంద్రపురంలోని ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: 'కమల' వికాసం కోసం ఆ ఊళ్లో నిత్య పూజలు!
తమిళనాడు డెల్టా ప్రాంతంలో ఉన్న పైంగనాడు తులసేంద్రపురం ప్రజలు కమల కోసం ప్రార్థించడం కొత్తేం కాదు. డెమొక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికైనప్పటి నుంచి ఆమె కోసం ప్రార్థిస్తూనే ఉన్నారు. కమల హారిస్ అమ్మమ్మ ఊరు ఇది. అందుకే, హారిస్ గెలవాలని ఊరు ఊరంతా కోరుకుంటోంది.

ఇదీ చదవండి: గెలుపు కోసం 'కొబ్బరికాయ' కొట్టిన కమల!