ETV Bharat / bharat

తిరుమలలో డిసెంబర్​ ఉత్సవాల లిస్టు ఇదే - ఆ 10 రోజులు దర్శనాలు రద్దు!

Special Festivals at Tirumala in December : శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్. తిరుమలలో డిసెంబర్​ నెలలో నిర్వహించే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Special Festivals at Tirumala in December

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 5:06 PM IST

Tirumala Special Festivals in December : నిత్యం లక్షలాది మంది భక్తులు.. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు. అందుకే.. అనునిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) శుభవార్త చెప్పింది. డిసెంబర్​ మాసంలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలను ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ పూర్తి వివరాలను వెల్లడించింది.

తిరుమలలో డిసెంబర్​లో నిర్వహించే శ్రీవారి విశేష ఉత్సవాల వివరాలిలా..

  • డిసెంబర్ 3న పార్వేట మండపంలో కార్తిక వనభోజన ఉత్సవం జరగనుంది.
  • డిసెంబర్ 8న సర్వ ఏకాదశి నిర్వహణ.
  • డిసెంబర్ 12న శ్రీవారి అధ్యయనోత్సవాలు ప్రారంభం.
  • డిసెంబర్ 17న ధరుర్మాసం మొదలుకానుంది.
  • డిసెంబ‌ర్ 22న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిలో చిన్న శాత్తుమొర‌ నిర్వహణ.
  • డిసెంబ‌రు 23న వైకుంఠ ఏకాద‌శి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం నిర్వహిస్తారు.
  • డిసెంబర్ 24న వైకుంఠ ద్వాదశి రోజు శ్రీవారి చక్రస్నానం.. శ్రీ స్వామి పుష్క‌రిణితీర్థ ముక్కోటి నిర్వహణ.
  • డిసెంబ‌రు 28న శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌ణ‌యక‌ల‌హ మ‌హోత్స‌వం నిర్వహిస్తారు.

ఏడు కొండల మీద కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని.. వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవాలని ఎక్కువ మంది భక్తులు తాపత్రయపడుతుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీవారిని తనివితీరా చూడాలని భారీ ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనానికి(Vaikunta Ekadashi 2023 Tickets) సంబంధించిన రూ.300 టికెట్లను ఆన్​లైన్​లో టీటీడీ విడుదల చేసింది. ఆఫ్‌లైన్‌ టికెట్లను తిరుపతి(Tirupati)లో డిసెంబర్​ 22న కౌంటర్ల ద్వారా.. జారీ చేయనుంది.

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఫిబ్రవరి టికెట్ల బుకింగ్స్‌ - ఎప్పుడో తెలుసా?

గదుల కేటాయింపుపై కీలక నిర్ణయం..

Vaikunta Ekadashi 2023 at Tirumala : వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi 2023)కి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గదుల కేటాయింపులో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు, అదేవిధంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 1 వరకు.. దాతలకు, వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఆన్​లైన్​లో శ్రీవారి దర్శనం కోసం బుక్​ చేసుకున్న దాతలను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా అనుమతించనున్నారు. దాతలందరికీ జయవిజయుల వద్ద నుంచి మహాలఘు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ(TTD) పేర్కొంది.

ఇక.. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్​ఆర్ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని డిసెంబర్​లో స్వామివారి దర్శనానికి భక్తులు ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.

TTD Job Notification 2023 : తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్​ ఉద్యోగాలు.. భారీగా వేతనాలు!

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.