Southern Railway Recruitment 2022 : రైల్వేలో ఉద్యోగం సాధించాలనే కోరిక ఉన్న వారికి రైల్వేశాఖ శుభవార్త అందించింది. దక్షిణ రైల్వే స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత, వయో పరిమితి, దరఖాస్తు ఫీజు, చివరి తేదీ వంటి వివరాలను తెలుసుకుందాం రండి.
అర్హత
12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు 7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 2/3లో పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు మాత్రమే మ్యాట్రిక్స్ స్థాయి 4/5లో పోస్ట్ కోసం అప్లై చేయవచ్చు.
వయో పరిమితి
అభ్యర్థి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు కూడా రూల్స్ ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మాజీ సైనికులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్/క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లింపు చేయవచ్చు.
7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 4/5లో పోస్ట్‌ల వివరాలు..
- బాస్కెట్ బాల్(పురుషులు): 2
- బాస్కెట్ బాల్(మహిళలు): 1
- క్రికెట్ (మహిళలు): 1
- వాలీబాల్(మహిళలు): 1
7వ CPC పే మ్యాట్రిక్స్ స్థాయి 2/3లో పోస్ట్‌ల వివరాలు..
- బాస్కెట్ బాల్(పురుషులు): 2
- బాస్కెట్ బాల్(మహిళలు): 2
- క్రికెట్ (పురుషులు): 2
- క్రికెట్ (మహిళలు): 2
- వాలీబాల్(పురుషులు): 2
- వాలీబాల్(మహిళలు): 2
- హాకీ(పురుషులు): 3
- స్విమ్మింగ్(పురుషులు): 1
- మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 21
జీతం వివరాలు..
- లెవల్ 2: రూ.19,900
- లెవల్ 3: రూ.21,700
- లెవల్ 4: రూ.25,500
- లెవల్ 5: రూ.29,200
చివరి తేదీ ఎప్పుడంటే?
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2023 జనవరి 2. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది రైల్వే శాఖ. ఆసక్తితో పాటు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iroams.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.