Solar Eclipse 2023 When Surya Grahanam will occur Date Time and Where can it Visible : గ్రహణం పేరు వినగానే ఎప్పుడు? ఎక్కడ? ఎంత సమయం వరకు ఉంటుంది..? అనే విషయాలను తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు. హేతువాదులు దాన్నొక ఖగోళ అద్భుతంగా భావిస్తే.. భగవంతుడిని విశ్వసించే వాళ్లు మాత్రం.. ఆ సమయంలో ఏకంగా దేవాలయాలనే మూసివేస్తారు. రేపు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మరి.. అవి ఎప్పుడు? ఏ సమయంలో ఏర్పడుతున్నాయి? ఎక్కడ కనిపిస్తాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది..?
సూర్యుడికి, భూమికి మధ్య.. చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజునే జరుగుతుంది. అంటే.. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తాయన్నమాట. దీంతో.. సూర్యుడి కిరణాలు భూమి మీద పడకుండా చంద్రుడు అడ్డుగా ఉంటాడు. దీనినే సూర్య గ్రహణం అంటారు.
సూర్యగ్రహణ సమయం..
ఈ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11:29 గంటలకు సూర్య గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11:34 గంటలకు ముగుస్తుంది. అంటే.. ఐదు నిమిషాల పాటు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుందన్నమాట.
సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
భారత కాలమానం ప్రకారం రాత్రివేళ ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి.. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు. పశ్చిమ ఆఫ్రికా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మెక్సికో దేశాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. అయితే.. హిందూ సంప్రదాయం ప్రకారం దేవీనవరాత్రుల సమయంలో గ్రహణం ఏర్పడటం అశుభంగా భావిస్తారు. అందువల్ల.. భారత దేశంలో సూర్యగ్రహణం వల్ల నవరాత్రి పూజలపై ప్రభావం ఉంటుందని కూడా కొంత మంది భావిస్తున్నారు. కానీ.. మన దేశంలో గ్రహణం కనిపించనందున.. అలాంటి ప్రభావం ఏమి ఉండదని మరికొందరు అంటున్నారు. సూర్యగ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం ముగుస్తుంది కాబట్టి.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనా.. సూర్యగ్రహణం సూతకం ఉండదని చెబుతున్నారు.
చంద్రగ్రహణం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఏర్పడుతుంది ?
చంద్రుడు, సూర్యుడి మధ్యలోకి భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే.. అప్పుడు భూమి మధ్యలో ఉంటుంది కాబట్టి.. సూర్యుడి కిరణాలు చంద్రుడిపై ప్రసరించవు. ఇది పౌర్ణమి రోజున మాత్రమే ఏర్పడుతుంది. చంద్రగ్రహణం.. ఈ నెల అక్టోబర్ 28వ తేదీన రాత్రి 11:31 గంటలకు ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 3:36 వరకు ఉంటుంది.