ETV Bharat / bharat

కాలుతున్న వాసనతో విమానం అత్యవసర ల్యాండింగ్​.. ఉల్లిపాయలే కారణం! - ఉల్లిపాయల వాసన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Kochi Sharjah Flight Emergency Landing : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్​ అయిన కొద్దిసేపటికే కొచ్చి-షార్జా విమానంలో కాలుతున్న వాసన వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్​ చేశారు. ఇంజినీరింగ్​ బృందం తనిఖీ చేయగా.. ఎలాంటి మంటలు, సాంకేతిక సమస్యలు లేవని తేలింది. ఇంతకీ ఆ వాసన ఎలా వచ్చిందంటే?

Kochi Sharjah Flight Emergency Landing
Kochi Sharjah Flight Emergency Landing
author img

By

Published : Aug 3, 2023, 5:06 PM IST

Air India Express Emergency Landing : కాలుతున్న వాసన రావడం వల్ల 175 మంది ప్రయాణికులతో టేకాఫ్​ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానం.. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ ​ అయింది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వెంటనే అధికారులు, ఇంజినీరింగ్​ బృందం విమానాన్ని తనిఖీ చేసి.. పొగ లేదా ఇతర సాంకేతిక సమస్యలు లేవని తెలిపింది. ప్రయాణికులు బయలుదేరేందుకు గురువారం ఉదయం మరొక విమానం ఎర్పాటు చేసింది ఎయిర్ ఇండియా.

ఇదీ జరిగింది.. బుధవారం రాత్రి కేరళలోని కొచ్చి నుంచి షార్జాకు 175 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా ఎక్స్​ప్రెస్​ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో కాలుతున్న దుర్వాసన వస్తున్నట్లు ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది ప్రయాణికులు కూడా అలాగే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా.. విమానాన్ని మళ్లీ కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేశారు. అయితే, ఆ సమయంలో ప్రయాణికుల్లో గందరగోళం నెలకొందని.. కానీ విమానం సురక్షితంగా ల్యాండ్​ అయిందని అందులో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్​నాదన్ తెలిపారు.

వెంటనే అధికారులు, ఇంజినీరింగ్ బృందం విమానాన్ని తనిఖీ చేసింది. ప్రాథమిక పరిశీలన తర్వాత విమానంలో పొగ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఏమీ లేవని తెలిపింది. అయితే, విమానంలోని కార్గో ప్రాంతంలో ఎవరో ఉల్లిపాయలు లేదా కూరగాయలు పెట్టడమే ఆ దుర్వాసన రావడానికి కారణమని అభిప్రాయపడింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా విచారం వ్యక్తం చేసింది. వారు బయలుదేరడానికి గురువారం ఉదయం 5.14 గంటలకు మరో విమానం ఏర్పాటు చేసింది.

అయితే, మిడిల్​ ఈస్ట్​కు వెళ్లే ఈ విమానంలో కూరగాయలు, పండ్లు, పూలు ఎక్కువ మొత్తంలో తీసుకెళ్తారు. ఈ మేరకు తాము ప్రయాణికులతో పాటు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సరఫరా చేస్తామని ఎయిర్​ ఇండియాకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.