ETV Bharat / bharat

బిష్ణోయ్​ తరలింపునకు రెండు బుల్లెట్​ ఫ్రూఫ్ కార్లు, 50 మంది పోలీసులు.. - లారెన్స్‌ బిష్ణోయ్‌

Sidhu Moose Wala murder Case: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మంగళవారం పురోగతి లభించింది. ఈ కేసులో నిందితుడు, గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్​ను పంజాబ్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ను 50 మంది పంజాబ్‌ పోలీసులు, రెండు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, 12 ఇతర వాహనాల భద్రతతో దిల్లీ నుంచి పంజాబ్‌కు తరలించనున్నారు.

Sidhu Moose Wala Case
సిద్ధూ మూసేవాలా హత్య కేసు
author img

By

Published : Jun 14, 2022, 11:07 PM IST

Updated : Jun 15, 2022, 6:14 AM IST

Sidhu Moose Wala murder Case: దేశంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ను పంజాబ్‌ పోలీసులు ఎట్టకేలకు తమ కస్టడీలోకి తీసుకోగలిగారు. సిద్ధూ హత్య కేసులో ఈ గ్యాంగ్‌స్టర్‌ ప్రమేయంపై తగిన ఆధారాలను పంజాబ్‌ పోలీసులు దిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టు ముందు ఉంచడంతో కస్టడీకి అనుమతి లభించింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ను విచారించడంలో భాగంగా పోలీసులు రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేసేందుకు అనుమతికి సంబంధించినది ఒకటి కాగా.. అతడిని భౌతికంగా కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి కోరడం రెండోది. ఈ సందర్భంగా కోర్టులో ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ అనమోల్‌ రతన్‌ సిద్ధూ ఈ సందర్భంగా కోర్టుకు హామీ ఇచ్చారు. 50 మంది పంజాబ్‌ పోలీసులు, రెండు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు, 12 ఇతర వాహనాల భద్రతతో దిల్లీ నుంచి పంజాబ్‌కు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. అలాగే, వెళ్లే రూట్లన్నీ వీడియో తీయనున్నట్టు కోర్టుకు వివరించారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తామని జడ్జికి తెలిపారు. అయితే, గ్యాంగ్‌స్టర్‌ తరఫున వాదించిన న్యాయవాది విశాల్‌ చోప్రా ఇందుకు అభ్యంతరం తెలిపారు. ట్రాన్సిట్‌ రిమాండ్‌ మంజూరు చేస్తే అతడికి ఏమైనా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. వర్చువల్‌గానే దర్యాప్తు చేయవచ్చన్నారు. ఈ కేసులో అవసరమైతే బిష్ణోయ్‌ని అరెస్టు చేసుకోవచ్చు కానీ.. అది దిల్లీలో మాత్రమే అని అన్నారు. అయితే, పంజాబ్‌ పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. తొలుత బిష్ణోయ్‌ అరెస్టుకు అనుమతించింది. ఆ తర్వాత అతడిని భౌతికంగా కస్టడీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవడంలో కొంత సమయం తీసుకున్న కోర్టు సాయంత్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇంకోవైపు, ఆయుధాల చట్టం కేసులో దిల్లీ పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత బిష్ణోయ్‌ను దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఈరోజే హాజరుపరిచారు. అనేక రాష్ట్రాల్లో కేసులు ఎదుర్కొంటున్న అతడు తిహాడ్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

సింగర్‌ సిద్ధూ హత్య వెనుక లారెన్స్‌ బిష్ణోయ్‌ హస్తం ఉందని ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులు చెప్పినట్టు కూడా పోలీసులు మంగళవారం దిల్లీ కోర్టుకు ఆధారాలు సమర్పించారు. అంతేకాకుండా, దిల్లీ పోలీసులు బిష్ణోయ్‌ని విచారించిన సందర్భంలోనూ ఈ కేసులో కీలక కుట్రదారు తానేనని స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పంజాబ్‌ పోలీసులు లారెన్స్‌ బిష్ణోయ్‌ని రిమాండ్‌లోకి తీసుకున్న 24గంటల్లోగా మాన్సా కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి: ఎఫ్​ఐఆర్​ అంటే పోర్నోగ్రఫీ కాదు.. అవన్నీ ఎలా రాస్తారు?: హైకోర్టు

రెండోరోజు ముగిసిన రాహుల్​ విచారణ.. బుధవారం కూడా..

Last Updated : Jun 15, 2022, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.