ETV Bharat / bharat

'సీమా హైదర్‌ పాకిస్థాన్​ ఏజెంట్‌?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి - seema haider isi agent

Seema Haider Pakistan : పబ్జీ ఆడుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యువకుడితో ప్రేమలో పడి, నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్‌ మహిళ సీమా హైదర్‌ను యూపీ ఏటీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆమెకు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సీమా హైదర్‌ పాకిస్థాన్​ ఏజెంట్‌ అని ఇర్ఫాన్‌ అనే వ్యక్తి నుంచి ముంబయి పోలీసులకు వచ్చిన సందేశం కలకలం రేపుతోంది. మరోవైపు సీమా హైదర్‌ సరిహద్దులు దాటి భారత్‌కు ఎలా వచ్చిందనే దానిపై నివేదిక ఇవ్వాలని యూపీ పోలీసులు, సాయుధ సరిహద్దు దళం ఎస్​ఎస్​బీని నిఘా వర్గాలు ఆదేశించాయి.

seema-haider-interrogates-by-indian-police-on-pakistan-agent
సీమా హైదర్‌
author img

By

Published : Jul 18, 2023, 6:56 PM IST

Seema Haider Latest News : పబ్జీ ఆడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా అనే యువకుడి ప్రేమలో పడి నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసముంటున్న పాకిస్థాన్‌ మహిళ సీమా గులాం హైదర్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సీమా ముందుగా సంప్రదించింది సచిన్‌ మీనాను కాదని విచారణలో తేలింది. ఆమెకు దిల్లీలో మరికొంత మందితో పరిచయం ఉన్నట్లు ఏటీఎస్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

అంతేకాకుండా, ఏటీఎస్‌ అధికారుల అడిగే ప్రతి ప్రశ్నకు సీమా ఆచితూచి సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం. విచారణలో సీమా హైదర్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి ముఖ్యమైన విషయాలకు సమాధానాలు రాబట్టడం సులువేం కాదని ఏటీఎస్ అధికారులు నిర్ధరణకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణ సమయంలో సీమా ఆంగ్ల పరిజ్ఞానం, ఆమె ఆంగ్ల ఉచ్ఛారణ సైతం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం.

seema-haider-interrogates-by-indian-police-on-pakistan-agent
సచిన్ మీనా, సీమా హైదర్

మరోవైపు, సీమా హైదర్‌ పాకిస్థాన్‌ ఏజెంట్‌ అని, ఆమెను పాక్‌ తిరిగి పంపాలని ఇర్ఫాన్‌ అనే వ్యక్తి నుంచి ముంబయి పోలీసులకు సందేశం వచ్చింది. పాకిస్థాన్ నుంచి తాను ఈ సందేశం పంపినట్లు ఇర్ఫాన్‌ అందులో పేర్కొన్నాడు. భారత్‌కు హాని ఉందని తెలిపాడు. ఈ సందేశం నిజంగా పాక్‌ నుంచి వచ్చిందా, ఎవరు పంపారనే దానిపై ముంబయి పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సీమా హైదర్‌ వ్యవహారంపై నిఘా వర్గాలు కూడా దృష్టిసారించాయి. సరిహద్దుల వద్ద పోలీసు ధ్రువీకరణను తప్పించుకుని ఆమె ఎలా భారత్‌కు వచ్చిందనే దానిపై నివేదిక ఇవ్వాలని యూపీ పోలీసులు, సాయుధ సరిహద్దు దళం(ఎస్​ఎస్​బీ) నుంచి నివేదిక కోరాయి.

మరోవైపు.. జులై 4వ తేదీన సీమా అరెస్టుకు ముందు ఆమె దిల్లీ పారిపోయేందుకు ప్రయత్నించినట్లు నొయిడా పోలీసులు తెలిపారు. వీసా లేకుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నందుకు నొయిడా పోలీసులు జులై 4న సీమాను అరెస్టు చేశారు. ఆమెకు ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌తోపాటు అతడి తండ్రిని కూడా అరెస్టు చేశారు. అనంతరం వారికి బెయిలు లభించింది. ఈ నేపథ్యంలో వారి ముగ్గురిని యూపీ ఏటీఎస్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే, సీమా మాత్రం తాను ఇప్పుడు పూర్తి హిందువుగా మారిపోయానని, తిరిగి పాక్‌కు వెళ్లబోనని చెబుతోంది. మరోవైపు సీమా హైదర్‌ను పాకిస్థాన్‌కు పంపించాలని ఆమె భర్త గులాం హైదర్‌ సైతం కోరాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.