ETV Bharat / bharat

Tirumala: తిరుమలలో భద్రత గోవిందా..! సామాజిక మాధ్యమాల్లో ఆనంద నిలయం దృశ్యాలు

author img

By

Published : May 8, 2023, 10:37 PM IST

Updated : May 9, 2023, 6:23 AM IST

Security breach at Tirumala: తిరుమలలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం కలకలం రేపింది. వర్షం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు... ఈ ఘటన జరిగినట్లు టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ దృశ్యాల్ని తీసిన భక్తుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది పూర్తిగా నిఘా వైఫల్యమేనని బీజేపీ ఆరోపించింది.

Tirumala
తిరుమల

Security breach at Tirumala Temple: తిరుమలలో భద్రతా లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఓ భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది. శ్రీవారి ఆనంద నిలయం దృశ్యాలను ఆ భక్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో భద్రతా లోపాలు వెలుగులోకి వచ్చాయి. సెల్‌ఫోన్‌లో ఆనంద నిలయం దృశ్యాలు తీసిన భక్తుడి వివరాల కోసం సీసీ టీవీ దృశ్యాలను తిరుమల విజిలెన్స్‌ అధికారులు..పరిశీలిస్తున్నారు. ఫోన్‌లో తీసిన ఆనంద నిలయం దృశ్యాలు 'ఈటీవీ భారత్' వద్ద ఉన్నప్పటికీ శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వాటిని ప్రసారం చేయడం లేదు.

తిరుమల శ్రీవారి ఆలయంలో మరోమారు భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ భక్తుడు సెల్ ఫోన్‌తో ఆలయ ఆవరణలోకి ప్రవేశించి... ఆనంద నిలయం దృశ్యాల్ని చిత్రీకరించడం చర్చనీయాంశమైంది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో టీటీడీ అధికారులపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన భద్రత వ్యవస్థ ఉన్నా సెల్ ఫోన్‌తో లోపలికి ప్రవేశిస్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

శ్రీవారి ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతి లేదు. ఇతరత్రా లగేజీని కూడా అనుమతించరు. పలు దశల్లో సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాంటిది విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కుతున్న దృశ్యాలతో పాటు ప్రధాన ఆలయం కూడా ఈ వీడియోలో కనిపించటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన తిరుమల విజిలెన్స్ అధికారులు... వర్షం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు... ఈ ఘటన జరిగినట్లు నిర్ధరణకు వచ్చారు. ఆనంద నిలయం వీడియో చిత్రీకరించిన వ్యక్తిపై చట్టపర చర్యలు తీసుకుంటామని తెలిపారు.

'తిరుమల ఆనంద నిలయం దృశ్యాల చిత్రీకరణ ఘటనకు విజిలెన్స్ అధికారుల వైఫల్యమే కారణం. తిరుమలలో మూడు, నాలుగు అంచెల భద్రతను దాటుకొని సెల్ ఫోన్​లో శ్రీవారి వారి ఆనంద నిలయం దృశ్యాలను తీశాడు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాణిపాకం, చందనోత్సవం, తిరుమల ఇలా ప్రతి చోట ప్రభుత్వం వైఫల్యాలు స్పంష్టంగా కనిపిస్తున్నాయి. బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.'- భానుప్రకాశ్ రెడ్డి, బీజేపీ నేత

ఆనంద నిలయాన్ని మాత్రమే చిత్రీకరించారా లేక క్యూకాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేంత వరకు అన్ని ప్రాంతాలను చేశారా అనేది ఇప్పుడు భక్తుల్లో ఆందోళన నెలకొంది. భద్రత వైఫల్యానికి కారకులైన సిబ్బందిపై ఆదిలోనే కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేవి. సిబ్బందితోపాటు నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో తితిదే అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి.

ఆనంద నిలయం దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన భక్తుడు

ఇవీ చదవండి:

Last Updated : May 9, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.