ETV Bharat / bharat

పిల్లలకు 'కార్బెవాక్స్'​ అత్యవసర వినియోగానికి సిఫార్సు! - కార్బెవ్యాక్స్​

Corbevax Vaccine: పన్నెండు నుంచి పద్దెనిమిదేళ్ల వయసు పిల్లలకు కార్బెవాక్స్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ టీకా ధర రూ.145 ఉండొచ్చని పేర్కొన్నాయి.

Corbevax Vaccine
వ్యాక్సిన్
author img

By

Published : Feb 15, 2022, 1:45 AM IST

Updated : Feb 15, 2022, 6:33 AM IST

Corbevax Vaccine: 12-18 ఏళ్ల పిల్లలకు మరో టీకా అందుబాటులోకి రానుంది. బయోలాజికల్​-ఇ సంస్థకు చెందిన కార్బెవాక్స్ వ్యాక్సిన్​ అత్యవసర అనుమతికి డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియాకు చెందిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రెండు డోసుల కింద పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్​కు త్వరలోనే ఆమోదం లభిస్తుందని తెలిపాయి.

ఈ టీకా ధర రూ.145 (పన్నులు కాకుండా) ఉండొచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా సంస్థ టీకాలను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నాయి. ఇందుకోసం క్లీనికల్​ ట్రయల్స్​కు అవసరమయ్యే డేటాను కూడా త్వరలోనే సంస్థ సమర్పించనుందని తెలిపాయి.

ఈ టీకాకు ఆమోదం లభిస్తే.. 12-18 ఏళ్ల పిల్లల వ్యాక్సినేషన్​కు అందుబాటులోకి వచ్చిన రెండో టీకాగా నిలుస్తుంది.

మరోవైపు పెద్దల వ్యాక్సినేషన్​కు సంబంధించి గతేడాది ఆగస్టులో కేంద్రం 30 కోట్ల కార్బెవాక్స్​ టీకా డోసులను ఆర్డర్​ చేసింది. ఇటీవల మరో 5 కోట్ల డోసులను ఆర్డర్​ చేసింది. ప్రికాషనరీ డోసులకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి : రూపాయికే మెడిసిన్.. పేదల పాలిట 'స్టాలిన్​'

Last Updated : Feb 15, 2022, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.