ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి.. నిధులిచ్చే వాటిని నిషేధించాల్సిందే!'.. భుట్టో సాక్షిగా భారత్‌ ఘాటు వ్యాఖ్యలు - sco summit goa buttoo jardar

సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్సీవో సభ్య దేశాలకు నొక్కి చెప్పింది భారత్​. పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌భుట్టో జర్దారీ సాక్షిగా దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, భుట్టోకి జైశంకర్​.. నమస్తే పెట్టి స్వాగతం పలికారు.

JaishankarChannel of finances for terrorism must be seized blocked without distinction

author img

By

Published : May 5, 2023, 12:30 PM IST

Updated : May 5, 2023, 1:24 PM IST

SCO Summit 2023 Goa : పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ సాక్షిగా భారత్‌.. దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని ఎస్​సీవో సభ్య దేశాలకు నొక్కి చెప్పింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని ఎస్​సీవో విదేశాంగ మంత్రుల సమక్షంలో విదేశాంగ మంత్రి జై శంకర్.. పాక్‌కు పరోక్ష సూచనలు చేశారు.

గోవా వేదికగా భారత్‌ నేతృత్వంలో రెండో రోజు ఎస్​సీవో విదేశాంగ మంత్రుల మండలి సమావేశం జరిగింది. పాక్‌ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టోతో పాటు చైనా విదేశాంగ మంత్రి క్వింగ్‌ గాంగ్‌, రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు తజకిస్థాన్‌, కిర్జికిస్థాన్‌, కజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో ఆంగ్లాన్ని ఎస్సీవో మూడో అధికారిక భాషగా గుర్తించాలని సభ్య దేశాలను జైశంకర్‌ కోరారు. రష్యన్‌, మాండరిన్‌లు అధికారికంగా ఉన్న క్రమంలో ఆంగ్లాన్నీ అధికారిక భాషగా చేర్చాలన్నారు. ఎస్సీవోలో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని జైశంకర్‌నొక్కి చెప్పారు

"ఉగ్రవాద ముప్పు నిరంతరం కొనసాగుతోంది. ఉగ్రవాదానికి ఎటువంటి సమర్థన ఉండకూడదు. దానిని సమర్థించడం, సీమాంతర ఉగ్రవాదంతోపాటు అన్ని రూపాల నుంచి తీవ్రవాదాన్ని నిర్మూలించాలి. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలి. ఎస్​ఈవో ఉద్దేశ్యాలలో ఉగ్రవాదం ముఖ్యమైనదని మళ్లీ గుర్తు చేస్తున్నాను. ఎస్​సీవో సంస్కరణలు, ఆధునీకరణపై చర్చ ప్రారంభమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాను."

-- ఎస్‌. జై శంకర్‌, విదేశాంగమంత్రి

నో షేక్​ హ్యాండ్​.. నమస్తే!
అయితే శుక్రవారం జరిగిన ఎస్​సీవో విదేశాంగ మంత్రుల మండలి సమావేశానికి వచ్చిన పలు దేశాల మంత్రులకు జైశంకర్‌ దగ్గరుండి స్వాగతం పలికారు. దాయాది దేశ మంత్రి భుట్టోను కూడా జైశంకర్‌.. షేక్​ హ్యాండ్​ కాకుండా నమస్కారంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫొటో దిగారు. ఆ తర్వాత వేదిక వద్దకు వెళ్లండని భుట్టోను భారత మంత్రి సాగనంపిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

  • #WATCH | EAM Dr S Jaishankar welcomes Pakistan's Foreign Minister Bilawal Bhutto Zardari for the Meeting of the SCO Council of Foreign Ministers in Goa pic.twitter.com/TVe0gzml1U

    — ANI (@ANI) May 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అతిథులకు ప్రత్యేక విందు!
ఎస్‌సీవో సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులకు జైశంకర్‌ గురువారం రాత్రి ప్రత్యేక విందు ఇచ్చారు. బెనాలిమ్‌లోని సముద్ర తీరంలో ఉన్న తాజ్‌ రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన ఈ డిన్నర్‌కు చైనా, రష్యా, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌ విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాక్‌ మంత్రి బిలావల్‌ భుట్టో కూడా ఈ విందుకు కాస్త ఆలస్యంగా వచ్చారు. అయితే విందులో బిలావల్‌, జైశంకర్‌ మాట్లాడుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కార్యక్రమానికి మీడియాను అనుమతించలేదు.

'నిబద్ధతను చాటిచెప్పేందుకే'
ఎస్‌సీవో సదస్సు కోసం భారత్‌కు బయల్దేరే ముందు బిలావల్‌ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పాక్‌కు ఎస్‌సీవో చార్టర్‌ పట్ల ఉన్న నిబద్ధతను చాటిచెప్పేందుకు తాను సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్నేహపూర్వక దేశాలకు చెందిన నేతలతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు ఉండబోవని అంతకుముందే ఆయన స్పష్టం చేశారు.

Last Updated : May 5, 2023, 1:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.