ETV Bharat / bharat

హిండెన్​బర్గ్ వివాదంపై సుప్రీం కీలక నిర్ణయం.. సత్యమే గెలుస్తుందన్న అదానీ

అదానీ- హిండెన్​బర్గ్ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. రెండు నెలల్లో సీల్డ్ కవర్​లో నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించింది. ఈ పరిణామాన్ని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్వాగతించారు. సత్యమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 2, 2023, 11:00 AM IST

Updated : Mar 2, 2023, 1:09 PM IST

అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఓపీ భట్​, జస్టిస్ జేపీ దేవ్​దత్​తో పాటు కార్పొరేట్ దిగ్గజాలు నందన్​ నీలేకని, కేవీ కామ్​నాథ్​, సోమ శేఖరన్​ సుందరేశన్​ను కమిటీలో సభ్యులుగా నియమించింది. రెండు నెలల్లోగా ధర్మాసనానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీల్డ్ కవర్​లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ) రూల్స్​లో ఉన్న 19వ సెక్షన్​ను అతిక్రమించారా? షేర్ల ధరల విషయంలో ఏమైనా అవకతవకలకు పాల్పడ్డారా? అనే విషయాలపై దర్యాప్తు చేయాల్సిందిగా సెబీని అదేశించింది సుప్రీంకోర్టు. కమిటీకి అన్ని విధాలా సహరించాల్సిందిగా కేంద్రం, ఆర్థిక సంస్థలు, సెబీ ఛైర్​ పర్సన్​కు సూచించింది.

స్వాగతించిన అదానీ..
అదానీ గ్రూప్​-హిండెన్​బర్గ్​ వ్యవహారంలో నిపుణుల కమిటీని నియమిస్తూ.. నిర్దిష్ట కాలపరిమిలోగా నివేదిక సమర్పించాలన్న సూప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ స్వాగతించారు. తన కంపెనీపై వచ్చిన ఆరోపణలకు ఇది ముగింపు పలుకుతుందని, చివరకు నిజమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "సుప్రీం కోర్టు ఆదేశాలను అదానీ గ్రూప్​ స్వాగతిస్తోంది. కమిటీకి కాలమపరిమితి విధించడం ఈ సమస్యకు ఇది ముగింపు పలుకుతుంది. ఎల్లప్పుడూ నిజమే విజయం సాధిస్తుంది." అని గౌతమ్​ అదానీ ట్వీట్​ చేశారు.

మదుపర్ల సంపదను కాపాడేందుకు రెగులేటరీ వ్యవస్థల పనితీరును బలోపేతం చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని, హిండెన్​బర్గ్​ రిపోర్టుపై దాఖలైన పలు పిటిషన్లను విచారించింది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా, నిపుణుల కమిటీకి సంబంధించి గతంలో.. సభ్యుల పేర్లు, విధివిధానలతో​ కేంద్రం సీల్డ్​ కవర్​లో ఓ నివేదికను అందించింది. అయితే, ఈ సీల్డ్​ కవర్​ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. విచారణ పారదర్శకంగా సాగేందుగు కమిటీని తామే నియమిస్తామని సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​ వ్యాఖ్యానించారు. కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై నాలుగు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిని లాయర్లు ఎమ్​ఎల్​ శర్మ, విశాల్​ తివారీ, కాంగ్రెస్​ లీడర్​ జయ ఠాకూర్, సామాజిక కార్యకర్త ముకేశ్​ కుమార్​ దాఖలు చేశారు.

అంతకుముందు ఫిబ్రవరి 13న హిండెన్‌బర్గ్‌ నివేదిక, తదనంతర పరిణామాలతో స్టాక్‌మార్కెట్‌లో రూ.లక్షల కోట్లు ఆవిరి కావడంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత మదుపర్ల సొమ్మును రక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇందుకు పటిష్ఠమైన యంత్రాంగం రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని వేయాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కమిటీని నియమించింది.

జరిగింది ఇదే..
షేర్ల ధరల్లో అదానీ గ్రూప్​ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. అమెరికా న్యూయార్క్​కు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్​బర్గ్​ జనవరి 24న ఓ నివేదిక వెలువరించింది. దీంతో దీంతో అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఎదురుదాడిగి దిగిన అదానీ గ్రూప్​.. హిండెన్​బర్గ్​పై ప్రతి ఆరోపణలు చేసింది. కావాలనే తమను దెబ్బకొట్టానికే ఇది చేశారంది. హిండెన్​బర్గ్​ సంస్థను 'అనైతిక షార్ట్​ సెల్లర్​'గా అభివర్ణించింది. ఆ రిపోర్టులో చేసిన ఆరోపణలన్నీ అబద్దాలే అని తిప్పికొట్టింది. దీంతో పాటు జనవరి 29న 413 పేజీల రిపోర్టును అదానీ గ్రూప్​ వెలువరించింది. అందులో 'ఇది అదానీ గ్రూప్​పై కాదు.. ఇండియాపై దాడి' అని అభివర్ణించింది. దీనిపై స్పందించిన హిండెన్​బర్గ్​.. దేశం ముసుగులో తప్పించుకోలేరని హితవు పలికింది.

Last Updated : Mar 2, 2023, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.