ETV Bharat / bharat

మధ్యంతర బెయిల్​తో తలోజా జైలు బయట అర్ణబ్​ - Arnab released from Taloja jail

arnab case
ఆర్నబ్ కేసు
author img

By

Published : Nov 11, 2020, 3:06 PM IST

Updated : Nov 11, 2020, 9:48 PM IST

20:43 November 11

తలోజా జైలు నుంచి 'అర్ణబ్'​ విడుదల

రిపబ్లిక్​ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు.అంతకముందు మధ్యంతర బెయిల్​ మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్​కు ఆదేశాలు జారీచేసింది సుప్రీం కోర్టు.

19:38 November 11

బెయిల్ మంజూరు

రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్ అర్ణబ్​ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అర్ణబ్​తో సహా.. ఈ కేసులో నిందితులైన మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే.. సహ నిందితులకు రూ. 50వేల వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలన్న సుప్రీం.. ఈ ఉత్తర్వులను  వెంటనే అమలు చేయాలని ముంబయి పోలీసు కమిషనర్​కు ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కీలక వ్యాఖ్యలు..

అర్ణబ్​ బెయిల్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్టేనని వ్యాఖ్యానించింది. సిద్ధాంతాల ఆధారంగా, ప్రభుత్వ నిర్ణయాలతో విభేదిస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు వేధించడం సరికాదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు.. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటే పౌరుల హక్కులను, స్వేచ్ఛను కాపాడేందుకు.. న్యాయస్థానాలు ఉన్నాయన్న విషయాన్ని విస్మరించకూడదని గుర్తుచేసింది.

స్వేచ్ఛా కోణంలో..

జర్నలిస్ట్​ అర్ణబ్ కేసును తాము వ్యక్తిగత స్వేచ్ఛా కోణంలో చూస్తున్నామని తెలిపింది అత్యున్నత న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కోర్టులు జోక్యం చేసుకోకపోతే.. మనం విధ్వంసకర మార్గంలో పయనిస్తున్నట్లేనని స్పష్టం చేసింది. వ్యక్తిగత భావజాలం నచ్చకపోతే ఇలా లక్ష్యంగా చేసుకోవటం తగదన్న సుప్రీం.. డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యకు ప్రేరేపించినట్లా అని ప్రశ్నించింది. ఎఫ్​ఐఆర్​ పెండింగ్​లో ఉన్నప్పుడు బెయిల్​ మంజూరు చేయకపోతే న్యాయం జరిగినట్లేనా అని నిలదీసింది.

ఈ కేసులో మధ్యంతర బెయిల్​ కోసం అర్ణబ్​ చేసుకున్న దరఖాస్తు పిటిషన్​ను ఈ నెల 9న విచారించింది ముంబయి హైకోర్టు. బెయిల్​ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు.. దిగువ కోర్టులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

ఇదీ కేసు..

రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామిని ముంబయి పోలీసులు నవంబర్​ 4న అరెస్టు చేశారు. 2018లో 53ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆర్కిటెక్ట్​ అన్వే నాయక్​, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

16:18 November 11

అర్ణబ్​కు మధ్యంతర బెయిల్ మంజూరు

సుప్రీం కోర్టులో రిపబ్లిక్ టీవీ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామికి ఊరట లభించింది. అర్ణబ్​తో పాటు సహ నిందితులకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

14:31 November 11

రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆత్మహత్య కేసులో ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి బెయిల్​ పిటిషన్​పై విచారించిన జస్టిస్ చంద్రచూడ్​ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలా ఓ వ్యక్తి స్వేచ్ఛను హరిస్తే న్యాయం లభించినట్లేనా అని ప్రశ్నించింది.

భావజాలం, అభిప్రాయ భేదం ఆధారంగా కొంతమంది వ్యక్తులను ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటే.. వారిని కాపాడేందుకు ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అర్ణబ్​ కేసులో నిర్బంధ విచారణ అవసరమా అని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది .  

"ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకపోతే.. మనం విధ్వంసం దిశగా పయనిస్తున్నట్లే. వ్యక్తిగత భావజాలం నచ్చకపోయినా ఇలా లక్ష్యంగా చేసుకోవటం తగదు. డబ్బులు చెల్లించకపోతే ఆత్మహత్యకు ప్రేరేపించినట్లా? ఎఫ్​ఐఆర్​ పెండింగ్​లో ఉన్నప్పుడు బెయిల్​ మంజూరు చేయకపోతే న్యాయం జరిగినట్లా? "

- జస్టిస్ డీవై చంద్రచూడ్​

ఇదీ చూడండి: అర్ణబ్​ బెయిల్​ పిటిషన్​పై సుప్రీంలో విచారణ

Last Updated : Nov 11, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.