ETV Bharat / bharat

'ఆ కొలీజియం సమావేశ వివరాలు ఇవ్వలేం'.. RTI పిటిషన్​ను కొట్టేసిన సుప్రీం - సుప్రీంకోర్టు కొలీజియం వార్తలు

2018 డిసెంబర్ 12న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశాల వివరాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సాధారణ సంప్రదింపుల వివరాలను వెల్లడించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.

SC COLLEGIUM RTI
SC COLLEGIUM RTI
author img

By

Published : Dec 9, 2022, 12:58 PM IST

సమాచార హక్కులో భాగంగా కొలీజియం సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలోని సభ్యులు జరిపిన చర్చలు, సంప్రదింపుల వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది.
'కొలీజియంలోని సభ్యులంతా సంతకం చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా ఖరారవుతుంది. సంతకాలు చేయకుండా.. సాధారణ చర్చలు, సంప్రదింపులు జరిపి జారీ చేసిన తాత్కాలిక ముసాయిదాలను తుది నిర్ణయంగా పరిగణించలేం. కొలీజియం అనేది బహుల సభ్యుల వ్యవస్థ. ఇందులో తీసుకున్న తాత్కాలిక నిర్ణయాలను పబ్లిక్ డొమైన్​లో ఉంచలేం' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొలీజియంలో సభ్యులుగా ఉన్న మాజీ న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను తాము కట్టడి చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై వచ్చిన మీడియా కథనాలను సైతం అడ్డుకోలేమని పేర్కొంది.

న్యాయమూర్తుల నియామకాల్లో భాగంగా 2018 డిసెంబర్ 12న కొలీజియం సమావేశమైంది. అయితే, ఆ రోజు సిఫార్సుల విషయంపై సంప్రదింపులు మాత్రమే జరిగాయని, తుది నిర్ణయం తీసుకోలేదని 2019 జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం ప్రకటించింది. కాగా, డిసెంబర్ 12 నాటి సమావేశాల అజెండా ఏంటో చెప్పాలని ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్.. గతంలో దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్​ను సైతం సుప్రీం తోసిపుచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.