ETV Bharat / business

అదిరే డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, సూపర్ రేంజ్‌తో - మారుతి, టాటా కార్స్‌ - ఆటో ఎక్స్‌పో 2025 ఫస్ట్ డే హైలెట్స్‌ ఇవే! - BHARAT MOBILITY GLOBAL EXPO 2025

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఫస్ట్ డే హైలెట్స్‌ - అదరగొట్టిన మారుతి, టాటా, హ్యుందాయ్, టయోటా కార్ మోడల్స్!

Bharat Mobility Global Expo 2025
Bharat Mobility Global Expo 2025 (IANS (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2025, 10:32 AM IST

Bharat Mobility Global Expo 2025 : భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025 మొదటి రోజు బంపర్ హిట్ అయ్యింది. మారుతి సుజుకి, టాటా, టయోటా, హ్యుందాయ్‌ బీఎండబ్ల్యూ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ త్వరలో లాంఛ్‌ చేయనున్న తమ లేటెస్ట్ మోడల్‌ కార్లను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించాయి. వాటిలో ప్రధానంగా హ్యుందాయ్‌ క్రెటా, మారుతి ఈ-విటారా, టయోటా అర్బన్‌ క్రూయిజర్ బీఈవీ, టాటా కంపెనీకి చెందిన సియెర్రా, హారియర్ ఈవీ, స్టెల్త్‌ ఎడిషన్లు, బీఎండబ్ల్యూ iX1 LWB ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. Maruti e Vitara : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ కారు అయిన ఈ-విటారాను ఆవిష్కరించింది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. దీని డ్రైవింగ్ రేంజ్‌ 500 కి.మీ అని కంపెనీ చెబుతోంది.

2. Toyota Urban Cruiser BEV : టయోటా ఈ ఎక్స్‌పోలో అర్బన్ క్రూయిజర్‌ బీఈవీ కారును ప్రదర్శించింది. మారుతి ఈ-విటారానే రీ-బ్యాడ్జ్‌ చేసి దీనిని తీసుకువచ్చారు. ఇది కూడా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.

3. Hyundai Creta Electric : ఈ ఎక్స్‌పోలో హ్యుందాయ్ కంపెనీ తమ లేటెస్ట్ క్రెటా ఈవీని ప్రదర్శించింది. దీని ధర బహుశా రూ.17.99 లక్షలు - రూ.23.50 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. కంపెనీ దీని డ్రైవింగ్ రేంజ్ 473 కి.మీ అని చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఇంకా బాస్‌ మోడ్‌, డిజిటల్ కీ, ఫోల్డబుల్‌ ట్రే, డ్రైవర్ సీట్ మెమొరీ సెట్టింగ్స్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

4. Tata Cars 2025 : టాటా కంపెనీ ఈ ఎక్స్‌పోలో తమ అప్‌కమింగ్ కార్లను ప్రదర్శించింది. అందులో నెక్సాన్ ఈవీ, హారియర్‌ ఈవీ ఉన్నాయి. అలాగే సియోర్రా ఐసీఈ, అవిన్యా క్రాస్‌ఓవర్‌లను కూడా ఆవిష్కరించింది.

5. Skoda Cars 2025 : స్కోడా కంపెనీ కూడా తమ లేటెస్ట్‌ ఆక్టేవియా వీఆర్‌ఎస్‌ను ప్రదర్శించింది. దీనిని 2025లోనే లాంఛ్ చేయనుంది. ఇదే విధంగా స్కోడా కొడియాక్‌, సూపర్బ్ కూడా ఈ ఏడాది ఏప్రిల్‌, డిసెంబర్‌ నెలల్లో వరుసగా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. స్కోడాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు ఎన్యాక్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో సేల్‌కు రానుంది.

6. Kia Cars 2025 : దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా కూడా ఈ ఎక్స్‌పోలో ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌, కార్నివాల్‌ హై-లిమోజిన్‌లను ప్రదర్శించింది. అంతేకాదు కార్నివాల్‌ హై-లిమోజిన్‌ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ ఈ మార్చి నెలలో లాంఛ్ కానుంది.

వీటిలోపాటు ఎంజీ, పోర్స్చే, బీఎండబ్ల్యూ, మెర్సిడీస్‌-బెంజ్‌ కార్లను కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. మరి రెండో రోజు మరెన్ని కార్లను ఆవిష్కరించనున్నారో చూడాలి.

మీ ఫ్యామిలీ కోసం మంచి కార్​ కొనాలా? ఈ టాప్​-10 సేఫ్టీ ఫీచర్స్ మస్ట్​!

రూ.7 లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-5 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.