ETV Bharat / bharat

71 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు.. 'డబుల్​ ఇంజిన్' ప్రయోజనమన్న మోదీ - rozgar mela 71 thousand appointment letters

'రోజ్​గార్ మేళా'లో భాగంగా 71 వేల మందికి నియామక పత్రాలను ప్రధాని మోదీ పంపిణీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

rozgar mela
rozgar mela
author img

By

Published : Nov 22, 2022, 4:18 PM IST

'రోజ్‌గార్‌ మేళా'లో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన మరో 71 వేల మందికి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలను అందించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ మినహా మిగిలిన రాష్ట్రాల్లోని 45 ప్రాంతాల్లో నియామక పత్రాలు అందజేశారు.

దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించడం, యువతకు సాధికారత కల్పించటం సహా జాతీయాభివృద్ధిలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు.. అన్ని అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మోదీ. గత నెలలో ఇలాంటి మేళాలు భాజపా పాలిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించామని మోదీ అన్నారు. ఇది డబుల్​ ఇంజిన్ ప్రభుత్వాల డబుల్​ ప్రయోజనమని.. ఇలాంటి కార్యాక్రమాలు నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పారు.

అమృతోత్సవాల వేళ దేశ ప్రజలందరం కలిసి అభివృద్ధి చెందిన దేశంగా మారుద్దామని శపథం తీసుకున్నాం. ఈ లక్ష్య సాధనలో మీరంతా దేశానికి సారథులు కానున్నారు. కొత్త బాధ్యతలు చేపడుతున్న మీరంతా దేశ ప్రజలతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి, యుద్ధం వంటి ఈ కిష్టసమయాల్లో ప్రపంచవ్యాప్తంగా యువత ముందు కొత్త అవకాశాలకు గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆర్థికమాంద్యం రానుందని ప్రముఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో భారత్‌ తన ఆర్థిక సామర్థ్యాన్ని చూపేందుకు, కొత్త అవకాశాలను పెంచుకునేందుకు సువర్ణ అవకాశమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.

-- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

rozgar mela
రోజ్​గార్ మేళా
rozgar mela
రోజ్​గార్ మేళా

మిషన్ మోడ్​లో పనిచేస్తోంది..
క్రితం నెలలో కేంద్ర పాలిత ప్రాంతాలు, ఎన్​డీఏ పాలిత రాష్ట్రాల్లో జాబ్​ మేళాలు నిర్వహించి నియామక పత్రాలు అందజేశామని ప్రధాని గుర్తు చేశారు. ' గత నెలలో మహారాష్ట్రలో, గుజరాత్​లో వేలకొద్ది నియామక పత్రాలు అందించాం. అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్​, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, అండమాన్​ నికోబార్ దీవులు, లక్షద్వీప్​, దాద్రా నగర్​ హవేలి, డామన్ డయ్యూ, చండీగఢ్​లో కూడా జామ్​ మేళాలు నిర్వహించి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.

ఈ నెల 24, 28 తేదీల్లో గోవా, త్రిపురాల్లో కూడా రోజ్​గార్​ మేళాలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మిషన్​ మోడ్​లో పనిచేస్తోంది. యువతే దేశానికి బలం.. వారి నైపుణ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది' అని మోదీ పేర్కొన్నారు.

rozgar mela
రోజ్​గార్ మేళా

వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు..
యువత ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి.. వారిని దేశ అభివృద్ధిలో భాగం చేసేందుకు సంకల్పించిన మోదీ.. రోజ్​గార్ మేళాలు​ నిర్వహిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. అక్టోబర్​లో 75 వేల మందికి నియామక పత్రాలు అందించినట్లు తెలిపింది. వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల మందిని నియమించుకునేట్లు వివిధ ప్రభుత్వ విభాగాలను మోదీ అదేశించినట్లు పేర్కొంది.

క్రమశిక్షణకు 'కర్మయోగి ప్రారంభ్​'..
'కర్మయోగి ప్రారంభ్​' అనే మాడ్యూల్​ను కూడా మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ మాడ్యూల్​ ఒక ఆన్​లైన్ ఓరియెంటేషన్​ కోర్సు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియామావళి, మానవ వనరుల విధానాలు, జీత భత్యాలు, కార్యాలయంలో ఎలా ఉండాలి అనే తదితర విషయాల గురించి సమాచారం ఉంటుంది. దాంతో ఉద్యోగాల్లో ఎలా మెలగాలనేది కొత్తగా చేరిన వారు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఇవీ చదవండి: గుజరాత్​ ఎన్నికలు.. పటేల్​ ఓటు.. ఈసారి ఎటు?

పర్యావరణం కోసం సైకిల్​ ఎక్కిన ఆర్మీ మ్యాన్​.. ఏకంగా 18వేల కి.మీ. ప్రయాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.