ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో 76 శాతానికి రిజర్వేషన్లు.. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్ - ఛత్తీస్​గఢ్ రిజర్వేషన్లు

ఛత్తీస్​గఢ్​ శాసనసభ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కీలక బిల్లులను ఆమోదించింది. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి చేరింది.

Reservation In Chhattisgarh
Reservation In Chhattisgarh
author img

By

Published : Dec 3, 2022, 9:02 AM IST

ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో జనాభా ఆధారంగా అందించే రిజర్వేషన్లపై ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ సంచలన నిర్ణయం తీసుకుంది. 5 గంటలకుపైగా జరిగిన సుదీర్ఘ చర్చలో రిజర్వేషన్లకు సంబంధించిన 2 బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 76 శాతానికి చేరింది. ఈ బిల్లుల ప్రకారం షెడ్యూల్ తెగలకు 32 శాతం, ఇతర వెనకబడిన కులాలకు 27 శాతం, షెడ్యూల్‌ కులాలకు 13 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. మరో 4 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించారు.

గత భాజపా ప్రభుత్వాలు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పరిమాణాత్మక డాటా కమిషన్‌ను ఏర్పాటు చేయలేకపోయాయని... తమ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర సీఎం భూపేశ్ బఘేల్ వివరించారు. కరోనా కారణంగా కమిషన్ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలిపారు. స్పీకర్ నేతృత్వంలో ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేలంతా ప్రధానిని కలిసి... ఈ సవరణ బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరాలని విజ్ఞప్తి చేశారు. పరిమాణాత్మక డాటా కమిషన్ నివేదికను సభలో ప్రవేశపెట్టలేదని ఆరోపించిన భాజపా... జనాభా ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం చెబుతున్నదానికి నిర్దిష్టమైన సమాచారం లేదని ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.