తాబేళ్లు సాధారణంగా నలుపు రంగులో లేదా మట్టి రంగులో దర్శనమిస్తాయి. కానీ శ్రీ విష్ణుమూర్తి దశావతారాలను పోలిన గుర్తులతో తాబేళ్లను ఎప్పుడైనా చూశారా..? రాయ్‌గఢ్ జిల్లాలో ఈ అరుదైన తాబేలు దర్శనమిచ్చింది. దీనిపై శ్రీ విష్ణుమూర్తి దశావతారాలను పోలిన గుర్తులు ఉన్నాయి.
ఈ తాబేలును చూసిన ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చంద్రాపుర్ మండలం మినాజ్ హోలా ప్రాంతంలోని శివాలయంలో ఓ పూజారి ఈ తాబేలును రక్షించారు.
తర్వాత కూర్మాన్ని ఆశ్రమానికి తెచ్చి పూజలు నిర్వహించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇదీ చదవండి: అరుదైన పసుపు రంగు తాబేలు ఇదిగో