డేరా సచ్చా సౌధ(dera sacha sauda) చీఫ్ డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను(dera baba news) ఓ హత్య కేసులో దోషిగా తేల్చింది హరియాణాలోని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు నేరానికి పాల్పడినట్లు తేల్చింది.
రంజిత్ సింగ్ హత్య కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. రామ్ రహీమ్ సింగ్తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్లు దోషులుగా తేలారు. ప్రస్తుతం డేరా బాబా సునారియా జైలులో ఉన్నారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు.
దోషులకు అక్టోబర్ 12న శిక్ష ఖరారు చేయనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు.
2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై అత్యాచారం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు డేరా బాబా.