Ram Mandir Pran Pratishtha Ritual : అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు క్రతువులు కొనసాగుతున్నాయి. మంగళవారం సరయు నది తీరంలో దీపోత్సవం, హారతి వంటి కార్యక్రమాలను నిర్వహించగా, బుధవారం కలశ పూజ జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య, ఇతరులు సరయు నది తీరంలో ఈ కలశ పూజను నిర్వహించారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామ మందిరానికి తీసుకెళ్లారు.
మరోవైపు అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి గురువారం బాల రాముడి విగ్రహన్ని తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. ప్రాణప్రతిష్ఠ జరిగే 22 తేదీ వరకు క్రతువులు జరుగుతాయని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. ఈ క్రతువులను నిర్వహించేందుకు సుమారు 121 మంది పురోహితులు వచ్చారని చెప్పారు. అయోధ్యలోని కరసేవకపురాన్ని సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు.
-
#WATCH | Shri Ram Janmbhoomi Teerth Kshetra trust member and Nirmohi Akhara's Mahant Dinendra Das and priest Sunil Das perform pooja in 'Garbha Griha' of Ayodhya Ram Temple pic.twitter.com/OTXm5Iqcxp
— ANI (@ANI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Shri Ram Janmbhoomi Teerth Kshetra trust member and Nirmohi Akhara's Mahant Dinendra Das and priest Sunil Das perform pooja in 'Garbha Griha' of Ayodhya Ram Temple pic.twitter.com/OTXm5Iqcxp
— ANI (@ANI) January 17, 2024#WATCH | Shri Ram Janmbhoomi Teerth Kshetra trust member and Nirmohi Akhara's Mahant Dinendra Das and priest Sunil Das perform pooja in 'Garbha Griha' of Ayodhya Ram Temple pic.twitter.com/OTXm5Iqcxp
— ANI (@ANI) January 17, 2024
-
#WATCH | Uttar Pradesh: Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai visits Karsevakpuram in Ayodhya to take stock of the work progress. pic.twitter.com/wLHLBgDqEk
— ANI (@ANI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttar Pradesh: Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai visits Karsevakpuram in Ayodhya to take stock of the work progress. pic.twitter.com/wLHLBgDqEk
— ANI (@ANI) January 17, 2024#WATCH | Uttar Pradesh: Shri Ram Janmabhoomi Teerth Kshetra General Secretary Champat Rai visits Karsevakpuram in Ayodhya to take stock of the work progress. pic.twitter.com/wLHLBgDqEk
— ANI (@ANI) January 17, 2024
గర్భగుడికి రాముడి విగ్రహం
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని గర్భగుడి సమీపానికి తీసుకొచ్చారు. ఓ వ్యానులో విగ్రహాన్ని తరలిస్తుండగా, అక్కడ ఉన్న ప్రజలందరూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు గర్భగుడిలో రాముడిని ప్రతిష్ఠించే చోట ట్రస్ట్ సభ్యులు పూజలు నిర్వహించారు. మరోవైపు సూర్యకుండ్ ప్రాంతంలో రాముడి చరిత్రను లేజర్ షో వేశారు.
-
PHOTOS | Visuals of the sanctum sanctorum in Ayodhya's Ram Mandir where the idol of Ram Lalla will kept. The Pran Pratishtha ceremony will be held on January 22.
— Press Trust of India (@PTI_News) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Third Party) pic.twitter.com/WMgoOVNZH3
">PHOTOS | Visuals of the sanctum sanctorum in Ayodhya's Ram Mandir where the idol of Ram Lalla will kept. The Pran Pratishtha ceremony will be held on January 22.
— Press Trust of India (@PTI_News) January 17, 2024
(Source: Third Party) pic.twitter.com/WMgoOVNZH3PHOTOS | Visuals of the sanctum sanctorum in Ayodhya's Ram Mandir where the idol of Ram Lalla will kept. The Pran Pratishtha ceremony will be held on January 22.
— Press Trust of India (@PTI_News) January 17, 2024
(Source: Third Party) pic.twitter.com/WMgoOVNZH3
-
VIDEO | Truck carrying Ram Lalla's idol passes through Lata Mangeshkar Chowk in Ayodhya. It is being taken to the sanctum sanctorum of the Ram Mandir. pic.twitter.com/TYqg8GJPMD
— Press Trust of India (@PTI_News) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Truck carrying Ram Lalla's idol passes through Lata Mangeshkar Chowk in Ayodhya. It is being taken to the sanctum sanctorum of the Ram Mandir. pic.twitter.com/TYqg8GJPMD
— Press Trust of India (@PTI_News) January 17, 2024VIDEO | Truck carrying Ram Lalla's idol passes through Lata Mangeshkar Chowk in Ayodhya. It is being taken to the sanctum sanctorum of the Ram Mandir. pic.twitter.com/TYqg8GJPMD
— Press Trust of India (@PTI_News) January 17, 2024
-
#WATCH | Uttar Pradesh | Laser show on display at Suryakund in Ayodhya. pic.twitter.com/XWcCdz6eNU
— ANI (@ANI) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Uttar Pradesh | Laser show on display at Suryakund in Ayodhya. pic.twitter.com/XWcCdz6eNU
— ANI (@ANI) January 17, 2024#WATCH | Uttar Pradesh | Laser show on display at Suryakund in Ayodhya. pic.twitter.com/XWcCdz6eNU
— ANI (@ANI) January 17, 2024
అప్పటి నుంచే భక్తులకు దర్శన భాగ్యం
జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని, 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ఇప్పటికే ట్రస్టు ప్రకటించింది.
కుటుంబంతో అయోధ్యకు వెళ్తా : కేజ్రీవాల్
మరోవైపు జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత కుటుంబ సమేతంగా అయోధ్య రాముడిని దర్శించుకుంటానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం అందినప్పటికీ, ఒక్కరే హాజరు కావాలని అందులో పేర్కొన్నారని ఆయన వివరించారు. భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా కుటుంబాన్ని అనుమతించబోమని ట్రస్ట్ చెప్పినట్లు ఆయన చెప్పారు. అందుకోసమే ప్రాణప్రతిష్ఠ అనంతరం భార్యాపిల్లలు, తల్లిందండ్రులతో కలిసి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
రామయ్య చెంతకు 108అడుగుల అగరుబత్తి- శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి వెయ్యి కిలోల లడ్డూలు
అయోధ్య గుడిలో రాముడి విగ్రహం చూశారా? విల్లుతో కమలం పువ్వుపై కొలువుదీరిన రామ్‌లల్లా