ETV Bharat / bharat

ఎంపీల సస్పెన్షన్​పై చర్చకు కేంద్రం ఆహ్వానం.. కానీ - రాజ్యసభ సస్పెన్షన్​పై చర్చ

Rajya Sabha MPs suspension: రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్​పై చర్చించేందుకు కేంద్రం నాలుగు పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపింది. అయితే, విపక్షాలన్నింటినీ పిలవకుండా నాలుగు పార్టీలనే ఆహ్వానించడం దురదృష్టకరమని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఇది విఫల స్టంటు అని టీఎంసీ నేత ఒబ్రెయిన్ ఎద్దేవా చేశారు.

rajya sabha mps suspension
rajya sabha mps suspension
author img

By

Published : Dec 20, 2021, 8:56 AM IST

Rajya Sabha MPs suspension: రాజ్యసభలో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీనిపై చర్చలకు రావాలని నాలుగు పార్టీలకే కేంద్రం ఆహ్వానం పంపడంపై ప్రతిషక్షాలు ఆదివారం మండిపడ్డాయి. ప్రభుత్వంతో భేటీకి హాజరుకాబోమని తేల్చి చెప్పాయి.

కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, శివ సేనలకు చెందిన 12 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఏర్పడ్డ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి సోమవారం చర్చలకు రావాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి.. సీపీఐ మినహా మిగిలిన నాలుగు పార్టీల ఫ్లోర్‌ లీడర్లకు లేఖలు రాశారు. ఫోన్‌ ద్వారా కూడా విజ్ఞప్తి చేశారు.

అయితే విపక్ష నేతలందరినీ ఆహ్వానించకుండా నాలుగు పార్టీలనే పిలవడం దురదృష్టకరమని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే... జోషికి తిరిగి లేఖ రాశారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా డిమాండ్‌ చేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై టీఎంసీ నేత ఒబ్రెయిన్ కూడా మండిపడ్డారు. ఇది విఫల స్టంటు అని ఎద్దేవా చేశారు. మొదట సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు సోమవారం సమావేశం కానున్నాయి.

ఇదీ చదవండి: మూడో వారంలో మరింత తగ్గిన రాజ్యసభ ఉత్పాదకత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.