ETV Bharat / bharat

kakori conspiracy: స్వాతంత్య్రోద్యమంలో విస్మృత వీరనారి.. రాజ్​కుమారి

author img

By

Published : Sep 26, 2021, 8:55 AM IST

సంగ్రామ నేపథ్యం లేదు... సంపన్న కుటుంబమూ కాదు... ఉన్నదల్లా దేశం కోసం ఏదైనా చేయాలనే తపనే! అదే రాజ్‌కుమారి గుప్తాతో రైలు దోపిడీకి సహకరించేలా చేసింది. 25 ఆగస్టు 9న కాకోరీ సమీపంలో జరిగిందీ దోపిడీ(kakori train robbery). దీన్నే కాకోరీ దోపిడీగా పిలుస్తుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా... తన మూడేళ్ల బిడ్డను చంకలో ఎత్తుకొని, లోదుస్తుల్లో ఆయుధాలు పెట్టుకొని పొలాల్లో పడి నడుస్తూ పోరాటంలో పాల్గొన్నారు. రాజ్‌కుమారి స్వాతంత్య్రోద్యమంలో ఓ విస్మృత వీరనారి!

kakori conspiracy
రాజకుమారి

కాన్పుర్‌ దగ్గర్లోని బందా జిల్లా వాసి రాజ్‌కుమారి గుప్తా! తండ్రి చిన్న కిరాణాకొట్టు వ్యాపారి. 1902లో పుట్టిన రాజ్‌కుమారికి 13వ ఏటనే మదన్‌మోహన్‌ గుప్తాతో పెళ్లయింది. మదన్‌ అప్పటికే కాంగ్రెస్‌ కార్యకర్తగా జాతీయోద్యమంలో పాల్గొనేవారు. అదే సమయంలో తన స్నేహితుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌కు చెందిన విప్లవ సంస్థ హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ)తోనూ సంబంధాలుండేవి. రాజ్‌కుమారి కూడా భర్త బాటలో కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టారు. అయితే... సహాయ నిరాకరణ ఉద్యమం సగంలోనే ఆగిపోవటంతో ఆమెను విప్లవబాట ఆకర్షించింది. సాయుధమార్గంలోనే స్వాతంత్య్రం సాధ్యమనే చంద్రశేఖర్‌ ఆజాద్‌ తదితరుల ప్రభావం ఆమెపై ఎక్కువైంది. ఎంతగా అంటే... భర్తకు, అత్తమామలకు తెలియకుండా సందేశాలు, వస్తువులు చేరవేయటం వరకు. ఆజాద్‌ గ్రూపులో కీలకసభ్యురాలిగా మారింది.

ఆయుధాలు కొనటానికి తగినంత డబ్బు లేకపోవటంతో ఈ గ్రూపు ఓ సాహసానికి ఒడి కట్టింది. అదే రైలు దోపిడీ! వివిధ రైల్వే స్టేషన్ల నుంచి వసూలు చేసిన సొమ్మును బ్రిటిష్‌ అధికారులు రైలులో తీసుకొని వస్తున్న సంగతి తెలుసుకున్న ఈ బృందం లఖ్‌నవూకు సమీపంలో దీన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించింది. 1925 ఆగస్టు 9న కాకోరీ సమీపంలో జరిగిందీ దోపిడీ(kakori train robbery). దీన్నే కాకోరీ దోపిడీగా(kakori train robbery) పిలుస్తుంటారు. రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌, అష్వఖుల్లాఖాన్‌, అజాద్‌ తదితరులు దోపిడీని అమలు చేయగా... వీరికి సమయానికి ఆయుధాలు సమకూర్చే బాధ్యతను రాజ్‌కుమారి గుప్తాకు అప్పగించారు. ఎవరికీ అనుమానం రాకుండా... తన మూడేళ్ల బిడ్డను చంకలో ఎత్తుకొని, లోదుస్తుల్లో ఆయుధాలు పెట్టుకొని పొలాల్లో పడి నడుస్తూ వచ్చి వాటిని అందించారు. ప్రణాళిక ప్రకారం కాకోరీ వద్ద రైలును గొలుసులాగి ఆపిన ఆజాద్‌ బృందం.. ఆయుధాలతో గార్డును బెదిరించి డబ్బు లాక్కొని వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో వెతికి కొన్ని నెలల తర్వాత ఆజాద్‌ బృందాన్ని పట్టుకుంది. రాజ్‌కుమారి గుప్తాను కూడా అరెస్టు చేసింది.

వెంటనే భర్త, అత్తమామలు ఆమెతో తెగతెంపులు చేసుకున్నారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కుటుంబం వెలేసిన రాజ్‌కుమారి మూడుసార్లు జైలు జీవితం అనుభవించారు. 'పైకి గాంధేయవాదుల్లా ఉండేవాళ్లం... లోలోపల విప్లవవాదులం. ఆ క్షణానికి చేయాల్సింది చేశాం!' అంటూ స్పందించిన రాజ్‌కుమారి స్వాతంత్య్రోద్యమంలో ఓ విస్మృత వీరనారి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.