ETV Bharat / bharat

Rajasthan Road Accident Today : ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 11 మంది భక్తులు మృతి.. మరో 15 మంది.. - road accident news today rajasthan

Rajasthan Road Accident Today : ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. రాజస్థాన్​లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. బుధవారం వేకువజామున జరిగిందీ ప్రమాదం.

Rajasthan Road Accident Today
Rajasthan Road Accident Today
author img

By PTI

Published : Sep 13, 2023, 8:13 AM IST

Updated : Sep 13, 2023, 11:32 AM IST

Rajasthan Road Accident Today : రాజస్థాన్​లోని భరత్​పుర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఓ ట్రక్కు.. ఆగి ఉన్న బస్సును ఢీకొట్టడం వల్ల బుధవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆర్​బీఎం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీలో భద్రపరిచారు.

Bharatpur Road Accident : గుజరాత్​లోని భావ్​నగర్​ నుంచి ఉత్తర్​ప్రదేశ్​లో మథురకు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జైపుర్​- ఆగ్రా హైవేపై హంతారా​ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును లఖన్​పుర్​ ప్రాంతంలో ట్రక్కు ఢీకొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులను అంతు, నంద్రం, లల్లూ, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్​గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ గుజరాత్​లోని భావ్​నగర్​కు చెందినవారని తెలిపారు.

దైవ దర్శనానికి వెళ్తుండగా!..
"గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన భక్తులు పుష్కర్​లో దర్శనం చేసుకుని బస్సులో యూపీలోని మథురకు బయలుదేరారు. హంతారా సమీపంలో బస్సు టైరు పేలిపోయింది. దీంతో ప్రయాణికులు కొందరు బస్సు దిగగా.. మరికొందరు అందులోనే ఉన్నారు. అంతలో జైపుర్​ వస్తున్న ఓ ట్రక్కు.. వెనుక నుంచి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టి 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది. వెంటనే అంబులెన్స్​లు ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నాం " అని ఏఎస్పీ లఖన్ సింగ్ తెలిపారు.

సంతాపం తెలిపిన ప్రధాని మోదీ..
రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. గుజరాత్ నుంచి తీర్థయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఎక్స్​(ట్విట్టర్​) వేదికగా ఆకాక్షించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 చొప్పున ఎక్స్​గ్రేసియా ప్రకటించారు.

  • राजस्थान के भरतपुर में हुआ सड़क हादसा अत्यंत दुखद है। इसमें गुजरात से धार्मिक यात्रा पर गए जिन श्रद्धालुओं को अपनी जान गंवानी पड़ी है, उनके परिवारजनों के प्रति मेरी शोक-संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi

    — PMO India (@PMOIndia) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • The Prime Minister has approved an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who have lost their lives due to the mishap in Bharatpur. The injured would be given Rs. 50,000 each.

ఆలాగే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సైతం రాజస్థాన్ రోడ్డు ప్రమాదంపై స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Bharatpur Accident Ashok Gehlot :
సంతాపం తెలిపిన సీఎం..
మరోవైపు.. భరత్​పుర్ రోడ్డు ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరలో కోలుకోవాలి. పోలీసులు, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.' అని ఎక్స్​(ట్విట్టర్​)లో గహ్లోత్​ ట్వీట్ చేశారు.

  • भरतपुर में गुजरात से धार्मिक यात्रा आए श्रद्धालुओं की बस और ट्रेलर की टक्कर में 11 लोगों की मृत्यु अत्यंत दुखद है। पुलिस-प्रशासन मौके पर है एवं घायलों को उपचार के लिए अस्पताल ले जाया गया है।

    मैं ईश्वर से सभी दिवंगतजनों की आत्मा की शांति एवं परिजनों को हिम्मत देने की प्रार्थना…

    — Ashok Gehlot (@ashokgehlot51) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Tamilnadu Road Accident : 'పంక్చర్​'కు ఏడు ప్రాణాలు బలి.. మృతులంతా మహిళలే

Assam Road Accident : మార్కెట్​కు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు..

Last Updated : Sep 13, 2023, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.