ETV Bharat / bharat

'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుపాలు' - రాహుల్​ గాంధీ రాఫెల్​

ప్రశ్నించే వాళ్లను కేంద్రం జైలుకు పంపిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పెట్రో ధరలు, రఫేల్​ ఒప్పందానికి సంబంధించి కేంద్రంపై మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

rahul gandhi on govt rafale latest, రఫేల్​పై కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ
'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుపాలు'
author img

By

Published : Jul 6, 2021, 12:39 PM IST

కేంద్రాన్ని ప్రశ్నించిన వారు జైలుపాలు అవుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం, పెట్రో ధరల పెంపునకు సంబంధించి రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్​ వేదికగా కేంద్రంప విమర్శల దాడికి దిగారు.

"ఈ వాక్యాన్ని పూరించండి : స్నేహం కోసం రఫేల్​ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు, పన్ను వసూలు కోసం పెట్రో ధరలు పెంచారు, విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు. ప్రశ్నించిన వారికి జైలు శిక్ష, మోదీ ప్రభుత్వం ......" అని రాహుల్​ ట్వీట్​ చేశారు.

అంతకుముందు.. రఫేల్​ ఒప్పందంపై జాయింట్​ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తునకు కేంద్రం ఎందుకు సిద్ధంగా లేదని రాహుల్​ ప్రశ్నించారు. రూ.59వేల కోట్ల రఫేల్​ ఒప్పందంపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది.

ఇదీ చదవండి : 'రఫేల్ డీల్​'​పై రాహుల్​ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.