Rahul gandhi satires on modi: కేంద్రంలోని భాజపా సర్కారు ఇస్తున్న ఆత్మనిర్భర భారత్ నినాదంపై కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సమతా విగ్రహం చైనాలో తయారైందంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో ఇటీవలే రామానుజాచార్యుడి సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం సమతా మూర్తిని దర్శించుకున్నారు.
అయితే 216 అడుగుల ఎత్తైన ఈ సమతా విగ్రహం చైనాలో తయారైందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. కేంద్రం చెప్పే ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్నిపరోక్షంగా ప్రస్తావిస్తూ నవభారత్ చైనా నిర్భరా అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
-
Statue of Equality is Made in China.
— Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
‘New India’ is China-nirbhar?
">Statue of Equality is Made in China.
— Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022
‘New India’ is China-nirbhar?Statue of Equality is Made in China.
— Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022
‘New India’ is China-nirbhar?
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ అంటే ప్రధానికి భయం.. అందుకే విమర్శలు'