ETV Bharat / bharat

29 ఏళ్ల పంతానికి తెర.. రెండు వర్గాలను కలిపిన రాహుల్ గాంధీ! - గ్రామస్థులతో కలిసి రాహుల్ గాంధీ భోజనం

Rahul Gandhi Bharat Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలతో కలిసి భోజనం చేశారు రాహుల్ గాంధీ. ఇదే భారత్​ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.

Rahul Gandhi Bharat Jodo Yatra
Rahul Gandhi Bharat Jodo Yatra
author img

By

Published : Oct 3, 2022, 1:45 PM IST

Rahul Gandhi Bharat Jodo Yatra : భారత్​ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామంలో వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలను ఆదివారం సహపంక్తి భోజనాలతో కలిపారు. రాహుల్ గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్​దీప్​ సింగ్​ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్​ గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. ఈ రెండు వర్గాలను కలపడానికే ఈ భోజనాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్​ తెలిపింది. దీంతో 29 ఏళ్ల తర్వాత ఆ వర్గాల ప్రజలు ఒక్కటయ్యారని చెప్పింది.

Rahul Gandhi Bharat Jodo Yatra
గ్రామస్థులతో కలిసి భోజనం చేస్తున్న రాహుల్ గాంధీ

1993లో జరిగిన గొడవ తర్వాత.. ఇరు వర్గాలు నివసించే ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమదానం చేసి.. రోడ్డును పునరుద్ధరించారు. దీనికి భారత్​ జోడో రోడ్డు అని పేరు పెట్టారు. "దాదాపు 30 ఏళ్ల క్రితం వర్గ విభేదాల కారణంగా బడనవాలు అనే గ్రామంలో నరమేధం జరిగింది. ఇప్పటివరకు ఆ వార్గాల మధ్య ఆ దూరం అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాలతో కలిసి రాహుల్​ గాంధీ భోజనం చేశారు. విరిగి పోయిన వారి మనసులను తిరిగి రాజీ పడేలా చేశారు. ఇది భారత్​ జోడో యాత్ర విజయం" అని ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది కాంగ్రెస్.

Rahul Gandhi Bharat Jodo Yatra
టైల్స్​ వేస్తున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi Bharat Jodo Yatra
పాత ఇళ్లకు రంగులు వేస్తున్న రాహుల్​ గాంధీ
Rahul Gandhi Bharat Jodo Yatra
గోడపై రంగులు వేస్తున్న రాహుల్​ గాంధీ

ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి నివాళులు అర్పించారు రాహుల్. అనంతరం ఖాదీ కేంద్రం వద్ద భజన చేశారు. తర్వాత ఖాది గ్రామోద్యోగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడి మహిళలతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో.. 'గ్రామంలోని ప్రజల మనసులు కలపడానికి రాహుల్ గాంధీ పాత ఇళ్లకు రంగులేసి శ్రమ ధానం చేశారు' అని డీకే శివకుమార్ చెప్పారు.

ఇవీ చదవండి: వాయుసేనకు 'ప్రచండ' అస్త్రం.. కన్ఫ్యూజ్ చేస్తూ శత్రువుకు దెబ్బ!

గాంధీని తలపించేలా 'అసుర' రూపం.. హిందూ మహాసభ దుర్గా మండపంపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.