ETV Bharat / bharat

Punjab news Live: కొలిక్కి రాని సంక్షోభం- సిద్ధూకు చన్నీ 'ఆఫర్'! - సిద్దూ అమరీందర్​

Punjab news Live, Navjot Singh Sidhu to hold talks with Punjab CM channi
సిద్ధూ, పంజాబ్​ సీఎం, పంజాబ్​ కాంగ్రెస్​
author img

By

Published : Sep 30, 2021, 12:25 PM IST

Updated : Sep 30, 2021, 7:40 PM IST

18:42 September 30

ముగిసిన భేటీ

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​జీత్ సింగ్ చన్నీతో పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ.. తన అభ్యంతరాలను చన్నీకి వివరించినట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగా సమావేశం జరిగినప్పటికీ.. ఎలాంటి పరిష్కారం లభించలేదు.

ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం.. పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు హరీశ్ రావత్​ను రంగంలోకి దించుతోంది. సమస్య పరిష్కారం కోసం ఆయనే స్వయంగా చండీగఢ్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రకటన విడుదల చేసిన రావత్.. సంక్షోభం సద్దుమణిగేందుకు వారం సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేబినెట్ ఏర్పాటుతో సమస్య ముగిసిపోతుందని భావించానని చెప్పారు.

సిద్ధూకు ఆఫర్

సమావేశం అనంతరం చరణ్​జీత్ సింగ్ చన్నీ.. మీడియాతో మాట్లాడలేదు. అయితే, సిద్ధూకు చన్నీ ఓ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. దాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా అన్నది సిద్ధూ ఇష్టమని చెప్పినట్లు సమాచారం. కానీ ఆ ఆఫర్ ఏంటన్నది తెలియలేదు. 

అయితే, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఓ ఫార్ములాను రూపొందించినట్లు వెల్లడించాయి.

మంత్రివర్గ సమావేశం..

ముఖ్యమంత్రి చన్నీ అక్టోబర్ 4న అత్యవసర మంత్రివర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ రోజునే అన్ని విషయాలకు సమాధానం దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది. సిద్ధూ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సెప్టెంబర్​ 28న పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. అయితే దీన్ని కాంగ్రెస్​ అధిష్ఠానం ఇంతవరకు ఆమోదించలేదు. రాష్ట్ర స్థాయిలోనే విభేదాలను పరిష్కరించుకోవాలని చన్నీ, సిద్ధూలకు సూచించింది.

15:38 September 30

సీఎంతో సిద్ధూ భేటీ..

పంజాబ్ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సీఎం చరణ్​జిత్​ సింగ్​ చన్నీతో గురువారం భేటీ అయ్యారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. రెండు రోజుల కింద(సెప్టెంబర్​ 28న) పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సిద్ధూ. ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.  

ముఖ్యమంత్రిని చండీగఢ్​లోని పంజాబ్​ భవన్​లో కలవనున్నట్లు స్వయంగా ట్వీట్​ చేసిన సిద్ధూ.. ఎలాంటి చర్చలకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.

సిద్ధూ రాజీనామాను కాంగ్రెస్​ అధిష్ఠానం ఇంతవరకు ఆమోదించలేదు. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

డీజీపీ, అడ్వొకేట్​ జనరల్​ నియామకాలపై ప్రశ్నలు..

రాష్ట్రంలో తాత్కాలిక డీజీపీ​, అడ్వొకేట్​ జనరల్​ల నియామకంపై బుధవారం.. తన అసంతృప్తిని బయటపెట్టారు సిద్ధూ. మంత్రివర్గంలో కళంకితులకు చోటుదక్కడం కూడా తనను తీవ్ర కలతకు గురిచేసిందన్నారు. పంజాబ్​ సంక్షేమంపై రాజీ పడటం ఇష్టంలేకే రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు 4 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.  

చన్నీ చొరవ..

ఈ నేపథ్యంలోనే సీఎం చన్నీ ఆయనతో మాట్లాడి.. చర్చలకు రావాలని కోరారు.  

రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చన్నీ.. బుధవారం కేబినెట్​ భేటీ నిర్వహించారు. అనంతరం సిద్ధూతో ఫోన్​లో మాట్లాడారు.  సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. దీనికి బదులుగా నేడు భేటీకి సిద్ధమని సిద్ధూ పేర్కొన్నారు.  

తమ పార్టీలో తలెత్తిన పరిస్థితులను పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ హరీశ్ రావత్ గమనిస్తున్నారు. ఆయన దిల్లీ నుంచి పంజాబ్​కు వచ్చే అవకాశాలున్నాయి.  

అమరీందర్​ గుడ్​బై..

సిద్ధూతో విభేదాల నడుమ, హైకమాండ్​ ఆదేశంతో.. సెప్టెంబర్​ 18న పంజాబ్​ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు కెప్టెన్​ అమరీందర్​ సింగ్​. రెండురోజులకే చరణ్​జిత్​ సింగ్​ చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.  

ఇది జరిగిన వారానికే రాష్ట్ర పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. దీంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్​కు షాక్​ల మీద షాక్​లు తగిలినట్లయింది. సమస్యను రాష్ట్రంలోనే పరిష్కరించుకోవాల్సిందిగా.. కాంగ్రెస్​ అధిష్ఠానం చన్నీకి సూచించింది.  

11:59 September 30

Punjab news Live: పంజాబ్​ సీఎంతో సిద్ధూ కీలక భేటీ..

  • Chief Minister has invited me for talks … will reciprocate by reaching Punjab Bhawan, Chandigarh at 3:00 PM today, he is welcome for any discussions !

    — Navjot Singh Sidhu (@sherryontopp) September 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాంగ్రెస్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ(Sidhu news).. నేడు పంజాబ్ (Punjab news Live​) ముఖ్యమంత్రి చరణ్​జిత్​ సింగ్​ చన్నీని కలవనున్నారు. సీఎం తనను చర్చలకు ఆహ్వానించినట్లు ట్వీట్​ చేసిన సిద్ధూ(Sidhu news).. మధ్యాహ్నం 3 గంటలకు పంజాబ్​ భవన్​కు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి చర్చలకైనా సిద్దమేనని తెలిపారు.  

పంజాబ్(Punjab news Live​)​ కాంగ్రెస్​ చీఫ్​ పదవికి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ రాజీనామా చేసిన తర్వాత.. మళ్లీ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికే.. సీఎం పదవికి అమరీందర్​ సింగ్​ రాజీనామా చేయగా చన్నీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొద్దిరోజుల్లోనే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు సిద్ధూ(Sidhu news). అయితే.. కాంగ్రెస్​ ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. 

నిర్ణయం వెనక్కి..

రాజీనామాపై సిద్ధూ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలున్నాయని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా సిద్ధూనే కొనసాగుతారని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుందని సదరు వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం జరగబోయే సిద్ధూ-చన్నీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ చూడండి: Sidhu news: 'వ్యక్తిగతంగా ఎవరిపైనా వైరం లేదు.. ప్రజల కోసమే'

'కాంగ్రెస్​కు అధ్యక్షులు లేరు.. నిర్ణయాలు ఎవరివో తెలీదు'

సిద్ధూతో చన్నీ భేటీ.. పంజాబ్ కాంగ్రెస్ పరిస్థితులను గమనిస్తున్న రావత్

Last Updated : Sep 30, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.