ETV Bharat / bharat

ఎన్నికల బరిలో యువకిశోరాలు.. గెలుపుతో బోణీ కొడతారా? - పంజాబ్ న్యూస్

Punjab election new faces: పంజాబ్‌లో పలువురు యువకిశోరాలకు కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చింది. వీరంతా ఎన్నికల్లో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి సహా పలువురు యువనేతలు బరిలోకి దిగుతున్నారు.

punjab election new faces
punjab election new faces
author img

By

Published : Jan 27, 2022, 8:41 AM IST

Punjab election new faces: పంజాబ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్‌.. ఈ దఫా పలువురు యువ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. వారిలో- విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మాజీ లెక్చరర్‌ తదితరులతో పాటు ప్రముఖ నాయకుల వారసులూ ఉన్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఈ కుర్రకారు ఎలాంటి ఫలితాలను రాబడుతుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పోటీలో ఉన్న కొందరు కీలక యువ అభ్యర్థుల సంక్షిప్త వివరాలివీ..

మాళవిక సూద్ సచ్చర్(38)

punjab election new faces
.

Malavika sood sachar: ఈమె సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ప్రముఖ నటుడు, వితరణశీలి సోనూ సూద్‌ సోదరి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హర్‌జోత్‌ కమల్‌ను కాదనిమరీ మోగా సీటును కాంగ్రెస్‌ ఈమెకు కేటాయించింది.

Punjab assembly election 2022

సిద్ధూ మూసేవాలా (28)

punjab election
సిద్ధూ మూసేవాలా

పంజాబీ గాయకుడు. యువతలో ఆదరణ ఎక్కువ. మాన్సా నుంచి పోటీ చేస్తున్నారు.

రణ్‌వీర్‌కౌర్‌ మియాన్‌ (30)

ఆంగ్లంలో పీహెచ్‌డీ చేశారు. ఇటీవలి వరకు ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. ప్రస్తుతం బుడ్‌లాడా నుంచి బరిలో దిగారు.

మోహిత్‌ మోహింద్ర (32)

రాష్ట్ర మంత్రి బ్రహ్మ్‌ మోహింద్ర కుమారుడు. పటియాలా (గ్రామీణ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పట్టా ఉంది. యువజన కాంగ్రెస్‌ నేతగా పనిచేశారు. ఔత్సాహిక క్రీడాకారుడు.

కామిల్‌ అమర్‌సింగ్‌ (34)

తేగఢ్‌ సాహిబ్‌ ఎంపీ అమర్‌ సింగ్‌ కుమారుడు. రాయ్‌కోట్‌ సీటులో బరిలో దిగారు. ఈయన బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఎంబీయే పూర్తిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌కు అధికార ప్రతినిధిగా ఉన్నారు.

సందీప్‌ జాఖడ్‌ (45)

రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ సోదరుడి కుమారుడు. అబోహర్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఫ్లోరిడా అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

వీరితో పాటు గఢ్‌శంకర్‌లో బరిలో ఉన్న అమర్‌ప్రీత్‌సింగ్‌ లల్లీ, బల్లువానాలో పోటీకి దిగిన రాజేందర్‌ కౌర్‌, లంబీ నియోజకవర్గం టికెట్‌ దక్కించుకున్న జగ్‌పాల్‌సింగ్‌ అబుల్‌ ఖురానాలది కూడా యువరక్తమే. వీరంతా విజయంతో ఎన్నికల అరంగేట్రం చేస్తారని కాంగ్రెస్‌ ఆశిస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.