2019-20 సంవత్సరానికి జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) అవార్డులను (NSS day 2021) అందజేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. వర్చువల్‌గా రాష్ట్రపతి భవన్ నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ డే(National Service Scheme day) సందర్భంగా అవార్డులు ప్రదానం చేశారు.
ఈ క్రమంలో అవార్డు గ్రహీతలను (NSS day 2021) అభినందించారు రాష్ట్రపతి. అలాగే ప్రతి రంగంలోని మహిళలకు వారి ఆశయాలు, సామర్థ్యాలకు తగిన అవకాశాలను అందించే సమాజాన్నే ప్రగతిశీల సమాజంగా పిలుస్తారన్నారు. ఈ కార్యక్రమానికి(National service scheme award) కేంద్ర యుజవన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ దిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు.
"భారత్‌ను యువ దేశంగా పిలుస్తారు. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. స్వచ్ఛంద సమాజ సేవ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వం, స్వభావాన్ని అభివృద్ధి చేయాలనే ప్రాథమిక లక్ష్యంతో ఎన్ఎస్ఎస్(కేంద్ర రంగం) 1969 లో ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ సైద్ధాంతిక ధోరణి మహాత్మా గాంధీ ఆదర్శాల నుంచి ప్రేరణ పొందింది. ప్రతి రంగంలోని మహిళలకు వారి ఆశయాలు, సామర్థ్యాలకు తగిన అవకాశాలను అందించే సమాజాన్ని ప్రగతిశీల సమాజంగా పిలుస్తారు."
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఇదీ చూడండి: 'దావాల దాఖలుకు మళ్లీ పాత గడువే'