ETV Bharat / bharat

కరెంట్‌ కోతల భయాలు- రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు - విద్యుత్​ సంక్షోభం

దేశంలో బొగ్గు కొరత కారణంగా(coal shortage in india) విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని భయాందోళనలు నెలకొన్న తరుణంలో కేంద్రం కీలక సూచనలు చేసింది. మిగులు విద్యుత్​ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయాలని చెప్పింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్​ను ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలు వాడుకోవాలని తెలిపింది(coal shortage news).

power-min-asks-states-to-utilise-unallocated-power-from-central-plants
రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
author img

By

Published : Oct 12, 2021, 1:38 PM IST

దేశంలో బొగ్గు కొరతతో(coal shortage in india) విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు కరెంట్‌ కోతలకు సిద్ధమవుతున్నాయి(coal shortage news). ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోడ్ సర్దుబాటు కోసం విద్యుత్‌ కోతలు(power crisis in india ) అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ప్రజల అవసరాల కోసం కేంద్రం వద్ద ఉన్న 'కేటాయించని విద్యుత్‌'ను(power crisis latest news) వాడుకోవాలని తెలిపింది. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలకు 'కరెంట్‌' సాయం చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.

"బొగ్గు కొరత(coal shortage in india 2021) ఆందోళనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తమ వినియోగదారులకు కరెంట్‌ సరఫరా చేయకుండా లోడ్‌ సర్దుబాటు కోసం కోతలు విధిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఇదే సమయంలో వారు అధిక ధరలకు విద్యుత్‌ను విక్రయిస్తున్నట్లు కూడా తెలిసింది. వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేసే బాధ్యత డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలదే(power crisis latest news). ముందు వారు తమ వినియోగదారులకే సేవలందించాలి. 24×7 విద్యుత్‌ అందించాలి. తమ సొంత వినియోగదారులకు కరెంట్ సరఫరా చేయకుండా విద్యుత్‌ను విక్రయించకూడదు" అని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

"విద్యుత్‌ కేటాయింపుల మార్గదర్శకాల ప్రకారం.. సెంట్రల్‌ జనరేటింగ్ స్టేషన్ల వద్ద 15శాతం విద్యుత్‌ను ఏ రాష్ట్రాలను కేటాయించకుండా ఉంచడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ అవసరమున్న రాష్ట్రాలకు కేంద్రం దీన్ని కేటాయిస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా ఆ ‘కేటాయించని విద్యుత్‌’ను రాష్ట్రాలు ఉపయోగించుకుని తమ ప్రజలకు కరెంట్ సరఫరా చేయాలని కోరుతున్నాం. ఒకవేళ మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాలు.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ మిగులు విద్యుత్‌ను కరెంట్ అవసరమున్న రాష్ట్రాలకు కేటాయించేందుకు వీలుంటుంది" అని పేర్కొంది.

వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయకుండా.. కరెంట్‌ను అధిక ధరకు విక్రయించే రాష్ట్రాలపై(coal shortage in india latest news) కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం ఈ సందర్భంగా హెచ్చరించింది. అలా చేసే రాష్ట్రాలకు ‘కేటాయించని విద్యుత్‌’ను ఉపయోగించుకునే వెసులుబాటును ఉపసంహరించి.. దాన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ముంద్రా డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం- దిల్లీలో ఎన్ఐఏ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.