ETV Bharat / bharat

'భారత్​లో తొమ్మిదేళ్లలో భారీగా తగ్గిన పేదరికం' - భారత్​లో పేదరికం తగ్గుదల

India poverty rate 2022 World bank: భారత్​లో 2011తో పోలిస్తే 2019లో పేదరికం భారీగా తగ్గినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. తొమ్మిదేళ్లలో ఏకంగా 12.3 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గణనీయంగా తగ్గిందని తెలిపింది.

INDIA POVERTY
ప్రపంచ బ్యాంకు
author img

By

Published : Apr 17, 2022, 9:26 PM IST

India poverty rate 2022 World bank: భారత్‌లో 2011తో పోలిస్తే 2019లో పేదరికం తగ్గిందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడించాయి. 2011లో 22.5శాతంగా ఉన్న పేదరికం.. 2019కి వచ్చేసరికి 10.2 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. ఫలితంగా 2011-19 మధ్య కాలంలో 12.3 శాతం పాయింట్లు తగ్గినట్లు వివరించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని పరిశోధన నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

2011లో ఉన్న26.3 శాతం నుంచి 2019లో 11.6 శాతానికి పేదరికం దిగజారినట్లు తెలిపింది. అదే సమయంలో అర్బన్‌ ప్రాంతాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి పేదరికం తగ్గిందని వివరించింది. 2011-19 మధ్య గ్రామీణ, పట్టణ పేదరికం 14.7, 7.9 శాతం పాయింట్లు తగ్గాయని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. భారత్‌లోని చిన్న కమతాలున్న రైతులు అధిక లాభాలు గడించారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2013, 2019లో చేసిన రెండు సర్వేల ప్రకారం పెద్ద కమతాలున్న రైతుల వార్షిక ఆదాయం 2 శాతం మేర పెరిగితే, చిన్న రైతుల ఆదాయం పది శాతం మేర వృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు వివరించింది. ఆర్థికవేత్తలు సుతీర్థ సిన్హా రాయ్, రాయ్ వాన్ డెర్ వీడ్‌లు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు.

ఇదీ చూడండి: 'పేదరికంలోకి 50 కోట్లకుపైగా ప్రజలు- ఇక సమయం లేదు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.