ETV Bharat / bharat

'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం' - మోదీ వార్తలు

PM Modi: 2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఉపయోగించకపోవడం వల్ల పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. డ్రోన్ల సాంకేతికతతో కొత్త శకం మొదలైందని అన్నారు.

PM Drones
ప్రధాని మోదీ
author img

By

Published : May 27, 2022, 1:24 PM IST

Drone Festival 2022: గత ప్రభుత్వాలు సాంకేతికత వినియోగం పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాళ్లు సాంకేతికతను ఓ సమస్యగా చూసేవారని, పేదల వ్యతిరేకిగా దానికి ముద్ర వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. 8 ఏళ్ల క్రితం తాము పరిపాలనలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించామని పేర్కొన్నారు. కనిష్ట ప్రభుత్వం- గరిష్ఠ పాలన- సులభతర జీవన విధానం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దిల్లీలో రెండు రోజుల పాటు జరిగే డ్రోన్ మహోత్సవ్​ కార్యక్రమంలో పాల్గొని ప్రధాని ఈ మేరకు మాట్లాడారు. భారతదేశంలో డ్రోన్ల సాంకేతికత సరికొత్త విప్లవం తీసుకువచ్చిందన్నారు.

PM Drones
ప్రధాని మోదీ

" పరిపాలనలో సాంకేతికత కూడా చాలా ముఖ్యం. సుదూర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు చేరవేసేందుకు ఇది సాయం చేస్తుంది. భారత్​లో డ్రోన్ల సాంకేతిక పట్ల ఉత్సాహం, ఆసక్తి కన్పిస్తోంది. ఉద్యోగాల కల్పనకు ఈ రంగం దోహదం చేసే అవకాశాలున్నాయి. 2014కు ముందు పరిపాలనలో సాంకేతికతను ఓ సమస్యగా భావించేవారు. అందువల్ల పేదలు నష్టపోయారు. డ్రోన్ సాంకేతికత వల్ల ఎలాంటి మార్పులు వస్తాయో, ఎంత ఉపయోగం ఉంటుందో పీఎం స్వామిత్వ యోజన ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో తొలిసారి ప్రతి గ్రామంలోని ఆస్తులను డిజిటల్​గా మ్యాప్ చేస్తున్నాం. డిజిటల్ ప్రాపర్టీ కార్డులు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో వ్యవసాయం, రక్షణ, క్రీడ, విపత్తు నిర్వహణ రంగాల్లో డ్రోన్ల ఉపయోగం చాలా పెరుగుతుంది. నేను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పుడు డ్రోన్ల ద్వారా అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకుంటున్నా."

-ప్రధాని మోదీ

భారత్​ డ్రోన్ మహోత్సవ్-2022 దిల్లీలో మే 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతోంది. ఈ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీతో పాటు పౌర విమానయాన శాఖమంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్​, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, విదేశీ ప్రతినిధులు, సైన్యం, కేంద్ర బలగాలు, ప్రవేటు సెక్టార్​కు చెందిన 1600మందితో పాట్లు డ్రోన్ల అంకుర సంస్థలు పాల్గొంటున్నాయి.

ఇదీ చదవండి: నటి హత్యకు రివెంజ్​.. నలుగురు ముష్కరులు హతం.. మూడు రోజుల్లో 10 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.