Police Attack on Soldier in Anakapalli District: ఫోన్‌లో దిశ యాప్ ఎక్కించే విషయమై జరిగిన గొడవలో ఓ సైనికుడిపై పోలీసులు దాడి చేసిన ఉదంతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సంతబయలు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్ బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైౖఫిల్ క్యాంపులో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మంగళవారం పరవాడ సంతబయలు వద్ద బస్సుకోసం వేచిఉండగా అప్పటికే అక్కడున్న వారి ఫోన్లలో కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభారాణి.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో సయ్యద్ అలీముల్లా ఫోన్‌లోనూ డౌన్‌లోడ్ చేయించారు. అయితే వచ్చిన ఓటీపీని ఓ కానిస్టేబుల్ రాసుకున్నారు. ఓటీపీతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. మీ బ్యాడ్జిలపై పేర్లు లేవు. నాకు అనుమానం కలుగుతోంది.. మీ గుర్తింపు కార్డుల్ని చూపించాలని అలీముల్లా పోలీసుల్ని కోరారు.
Lawyers strike: నల్లకోటుపై లాఠీ.. ఆందోళనలో న్యాయ సమాజం
వేసుకున్న పోలీస్ డ్రెస్ కనిపించడం లేదా.. స్టేషన్‌కొస్తే గుర్తింపు కార్డుల్ని చూపిస్తామని కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. తర్వాత ఓ కానిస్టేబుల్ బూటుకాలితో తన్నారు. మహిళా కానిస్టేబుల్.. అలీముల్లా దవడపై కొట్టారు. గుర్తింపుకార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా అని పోలీసులను స్థానికులు ప్రశ్నించారు. పురుషులకు దిశ యాప్ ఎందుకని నిలదీశారు. అంతలో మరో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నలుగురూ కలసి అలీముల్లాను స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు బలవంతంగా ఆటో ఎక్కించబోయారు. బాధితుడు ప్రతిఘటించారు. చివరికి పోలీసులు అతని ఐడీకార్డును తీసుకుని వెళ్లిపోయారు. అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణను కలసి జరిగిన ఘటనను బాధితుడు వివరించారు. ఈ ఘటనకు ఎస్పీ విచారణకు ఆదేశించి.. నలుగురు కానిస్టేబుల్స్‌ను వీఆర్‌కు పంపించారు.
Lokesh Condemned Police Attack on Soldier: జగనాసుర పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ఎంతో ఆర్భాటంగా తెచ్చిన దిశా చట్టంకి దిక్కూ మొక్కూ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మహిళల భద్రతకు అంటూ సర్కారు తెచ్చిన దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని ఆరోపించారు. మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన దిశ యాప్‌ను పురుషుల మొబైల్లో బలవంతంగా డౌన్లోడ్ చేయించడం పలు అనుమానాలకి తావిస్తోందన్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన అనకాపల్లి జిల్లా రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గూండాల్లా దాడి చేయడం దారుణమని విమర్శించారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు, ఏపీకి వస్తే ఆయన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.
Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...
Chintakayala Vijay Condemned Police Attack on Soldier: అనకాపల్లి జిల్లాకి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన చింతకాయల విజయ్ తెలిపారు. పురుషులకి దిశ యాప్ ఎందుకు.. ఓటీపీ ఎందుకు అడుగుతున్నారని అన్నారు. పోలీసులు ప్రజల పీకపై కత్తి పెట్టి బెదిరించి యాప్‌ని డౌన్ లోడ్ చేయిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరు వ్యక్తిగత స్వేచ్ఛ కోణంలో పలు అనుమానాలకు దారి తీస్తుందని అన్నారు. ఒక వైపు వైసీపీ సామాజిక సాధికారత పేరుతో ఖాళీ కుర్చీలతో తుస్సు యాత్ర చేస్తూ ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వరుస దాడులు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.