Polavaram Guide Bund Collapse Reason: పోలవరం ప్రాజెక్టులో కుంగిపోయిన గైడ్‌బండ్‌ను పరిశీలించిన కేంద్ర నిజనిర్ధారణ కమిటీ.. దానికి గల కారణాలను నివేదించింది. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ఎగువన నిర్మించిన గైడ్‌బండ్ కుంగిపోవడానికి అందులో భాగంగా చేపట్టిన నిర్మాణాల్లో లోపాలే కారణమని కమిటీ స్పష్టం చేసింది.
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎడమ వైపు ఎగువ ప్రాంతంలో నిర్మించిన గైడ్‌బండ్ కుంగిపోవడానికి.. అందులో భాగంగా చేపట్టిన నిర్మాణాల్లో లోపాలే కారణమని కేంద్రం నియమించిన నిజనిర్ధరణ కమిటీ తేల్చి చెప్పింది. కాంక్రీటు గోడ నాణ్యతతో పాటు.. సరైన నైపుణ్యంతో పనిచేయకపోవడం కూడా మరో కారణం కావొచ్చని స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలోనే మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టిన ఈ పనులు.. నిర్దేశిత సమయంలో కాకుండా మూడు సీజన్లలో నిర్మించడం వల్ల కూడా సమస్యలు వచ్చినట్లు.. కేంద్ర నిజనిర్థరణ కమిటీ నివేదించింది.
Devineni Uma On Polavaram: సీఎం జగన్‌రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపం : దేవినేని ఉమ
గైడ్‌బండ్‌లో భాగంగా దాదాపు 25 మీటర్ల లోతున 1.5 మీటర్ల మందంతో రీఇన్‌ఫోర్స్‌మెంట్ సిమెంటు కాంక్రీటు గోడ నిర్మించారు. ఆ గోడ నిర్మాణం, నిర్మించిన తీరు, నాణ్యత సరిగా లేదని.. కేంద్ర కమిటీ నివేదికలో పేర్కొంది. ఆ గోడ ప్యానెళ్లుగా కాంక్రీటు పోసి ఒకదానితో మరొకటి షియర్ కీస్‌తో అనుసంధానించి లోపలికి దింపారని.. ఇలా దింపేటప్పుడు డిజైన్లకు అనుగుణంగా చేయలేకపోవడమూ గోడ వంగిపోవడానికి ప్రధాన కారణమని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. సరైన నైపుణ్యంతో పనిచేయకపోవడం కూడా కారణం కావచ్చని కమిటీ నివేదికలో వెల్లడించింది.
మేఘా ఇంజినీరింగ్ సంస్థ గైడ్‌బండ్ పనులు చేపట్టింది. జగన్ ప్రభుత్వ హయాంలోనే.. ఈ నిర్మాణాలన్నీ ప్రారంభించి పూర్తి చేసింది. ఇదే పని 3సీజన్లలో 2021 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు చేశారు. పోలవరంలో స్పిల్‌వే ఎగువన గైడ్‌బండ్ నిర్మించారు. యాబై లక్షల క్యూసెక్కుల వరద నీటిని బయటకు పంపించటానికి అనుగుణంగా స్పిల్‌వే నిర్మాణం చేపట్టారు. దానికి ఎడమవైపు జలాశయం నుంచి నీటిప్రవాహ సమయంలో సుడిగుండాలు వస్తున్నాయని.. ఆ నీరు స్పిల్‌వే పైనుంచి కూడా ప్రవహించే ప్రమాదం ఉందని దాన్ని నిరోధించేందుకు.. డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ నిర్ణయం మేరకు దీన్ని నిర్మించారు.
ఈ ఏడాది జూన్‌లో ఈ గైడ్‌బండ్ కుంగిపోయింది. తొలుత ఆర్‌సీసీ కట్ ఆఫ్ వాల్ వంగిపోయింది. అసలు ఈ గోడ వంగిపోవడానికి ప్రధాన కారణం.. అది ఒకే గోడలా నిర్మించలేదని.. ప్యానెళ్లుగా అనుసంధానించడంతో ఎక్కడో ఒక ప్యానెల్ దెబ్బతిందని కమిటీ గుర్తించింది. ఈ ప్రభావం మిగిలిన అన్ని ప్యానెళ్లపై పడి, గోడ వంగిపోయిందని.. ఫలితంగా, గైడ్‌బండ్ కుంగిపోయిందని కమిటీ తేల్చిచెప్పింది.
చైనేజిలోని కట్‌ఆఫ్ వాల్ 76 మీటర్ల నుంచి 350 మీటర్ల వరకు వంగిపోయింది. చైనేజి 140 మీటర్ల నుంచి చైనేజి 300 మీటర్ల వరకు గైడ్‌బండ్ కుంగిపోయింది. కట్ ఆఫ్ వాల్ కనీసం 0.6 మీటర్ల నుంచి కొన్నిచోట్ల గరిష్ఠంగా 11.98 మీటర్ల వరకు వంగిపోయింది. ఆ ప్రభావం గైడ్‌బండ్‌పై పడింది. గైడ్‌బండ్ 2.9 మీటర్ల నుంచి 6.12 మీటర్ల వరకు కుంగిపోయింది. చైనేజి 160 మీటర్ల వద్ద 6.12 మీటర్ల మేర కుంగిపోయింది. కట్ ఆఫ్ వాల్‌లో 105 ప్యానెళ్లు ఉండగా 42 ప్యానెళ్లు దెబ్బతిన్నాయని కమిటీ తెలిపింది.
Polavaram guide bund damaged : కుంగిపోయిన పోలవరం గైడ్‌బండ్.. బాధ్యులెవరు..? భవిష్యత్ ఏమిటి?
కీలకమైన కట్ ఆఫ్ వాల్‌లో ప్యానెళ్లు దెబ్బతినడం, గోడ నిర్మాణ సామర్థ్యంలో లోపాలని కమిటీ నివేదికలో తెలిపింది. కేంద్ర జలసంఘం ఆకృతులు సిద్ధం చేసినప్పుడు 2020 నవంబరులో ఈ కట్టడం ప్రారంభించి 2021 మార్చి నాటికి పూర్తిచేయాలని తేల్చారు. ఆ లోపు నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఈ నిర్మాణం మూడు సీజన్లలో పూర్తిచేశారు. ఒక్క సీజన్‌లోనే పూర్తి చేయటానికి అనువుగా కేంద్ర జల సంఘం ఈ డిజైన్లను ఆమోదించింది.
గైడ్‌బండ్‌లో రాళ్లు నింపే పని కూడా రెండు సీజన్లలో చేశారు. 2023 ఏప్రిల్ వరకూ పని చేస్తూనే ఉన్నారు. ఇలా మూడు సీజన్లలో చేయడం వల్ల వరదల సమయంలో వీఎస్‌టీలతో నేల అభివృద్ధి చేసినచోటే మళ్లీ బంకమట్టి రేణువులు పెద్దఎత్తున వచ్చి చేరాయని కమిటీ తేల్చింది. వరదల ముందు నిర్మాణం చేపట్టిన ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, తర్వాత నిర్మించిన ప్యానెళ్లు, స్టోన్ కాలమ్‌ల ప్రాంతంలోనే రిటైనింగ్ వాల్ వంగడమూ, డయాఫ్రం వాల్ కుంగడమూ కమిటీ గుర్తించింది. ఇదీ ఓ ప్రధాన కారణంగా నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది.
Devineni Uma: జగన్ కమీషన్ల కక్కుర్తి వల్లే.. పోలవరం గైడ్ బండ్ కుంగింది: దేవినేని ఉమ
స్పిల్‌వే ఎగువన ఎడమవైపున అప్రోచ్ ఛానల్‌ను ఆనుకుని ఎడమగట్టు వద్ద ఈ కట్టడం నిర్మించారు. ఒకే పెద్ద గోడలా ఇది నిర్మించలేదు. భూమి లోపలికి గోదావరి వైపుగా నిర్మాణం చేపట్టాల్సి రావడంతో.. గ్రాబర్ల సాయంతో మట్టిని ఎత్తిపోసి.. ఆర్‌సీసీ ప్యానెళ్లను భూమి లోపలికి దింపి గోడను నియమించారు. 105 ప్యానెళ్లుగా గోడ నిర్మించారు. ఈ ప్యానెళ్లను షీర్ కీస్‌తో అనుసంధానించారు.
పోలవరంలో నేలంతా బంకమట్టిలా ఉంటుంది. ఆ నేల ఎప్పటికప్పుడు అణిగిపోతుంది. అది నిర్మాణాలకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే నాలుగు వరుసల్లో వీఎస్‌టీలు ఏర్పాటు చేసి, నేలంతా గట్టిపడేలా చేసి ఆ తర్వాత గైడ్‌బండ్ నిర్మించారు.
పోలవరం గైడ్‌బండ్ కుంగిపోవడానికి నిర్మాణ లోపాలతో పాటు కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ లోపాలూ ఉన్నాయి కదా అని కేంద్ర జల్‌శక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ నిజనిర్ధారణ కమిటీని ప్రశ్నించారు. కమిటీ తన ముసాయిదా నివేదికను జూన్ 15న సమర్పించాక కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి సమక్షంలో సమావేశం నిర్వహించారు. తర్వాత ముసాయిదా నివేదికపై శ్రీరామ్ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కట్ ఆఫ్ వాల్.. పూర్తిస్థాయి గోడగా డిజైన్‌లో ప్రతిపాదించారు.
POLAVARAM GUIDE BUND కుంగిపోయిన పోలవరం గైడ్‌బండ్.. నదీ ప్రవాహ మళ్ళింపులో కీలకమదే
అది డ్రాయింగ్‌లోకి మారినప్పుడు ప్యానెళ్ల వారీగా నిర్మించేలా మార్చారు. నిర్మాణ సమయంలో షీర్ కీస్‌లో రీయిన్‌ఫోర్స్‌మెంట్ లేకుండా చేశారు. ఇది పూర్తిగా నిర్మాణం, డిజైన్లకు సంబంధించిన అంశమని శ్రీరామ్ ప్రశ్నించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ కోడ్ ప్రకారం అందులో అంతర్భాగంగానే షీర్‌కీస్‌లో రీయిన్‌ఫోర్సుమెంటు ఉంటుందని నిపుణుల కమిటీ పేర్కొంది. అలా నిర్మించడం వల్ల అది పూర్తిస్థాయి గోడలా పని చేస్తుందని వారు తెలిపారు.
ఈ గోడలో ఎక్కడో ఒక ప్యానెల్ విఫలమవడం వల్ల ఆ ప్రభావం మొత్తం గోడపై పడి వంగిపోయిందని కమిటీ చెబుతోందని.. అది పూర్తిగా డిజైన్లకు సంబంధించిన అంశమే కదా అని శ్రీరామ్ ప్రశ్నించారు. ఒక సీజన్‌లో నిర్మాణం జరగలేదని కేంద్ర జలసంఘం నిపుణులకూ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆకృతులను అవసరమైన మేర మార్చాలి కదా? కేంద్ర సంస్థలు ఆ బాధ్యత ఎందుకు నిర్వర్తించలేదని కూడా శ్రీరామ్ ప్రశ్నించారు.
2021, 2022 వరదల్లో ప్రవాహ వేగాన్ని బట్టి.. స్పిల్‌వే వైపు ఎక్కువగా ఉండటంతో అటువైపు కోత ఎక్కువగాను, గైడ్‌బండ్‌వైపు వేగం తక్కువగా ఉండటంతో అక్కడ కోత తక్కువగాను ఉందని నిపుణుల కమిటీ నివేదిస్తోంది. దీని ఆధారంగా శ్రీరామ్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. 2021 వరదల సమయానికి రిటైనింగ్ వాల్ లేనందున ఆ కోత రెండువైపులా జరిగి ఉండాలి కదా అని ప్రశ్నించారు. అక్కడ ఏర్పడ్డ కోత ఆకృతుల్లో పేర్కొన్న స్థాయి మేరకే ఉందా? అంతకు మించి దిగువకు కోత ఏర్పడిందా అని ప్రశ్నించారు.
Fact Finding Committee at Polavaram: దెబ్బతిన్న గైడ్ బండ్‌ను పరిశీలించిన నిజనిర్ధరణ కమిటీ
ఒకవేళ స్పిల్‌వే వైపు, బండ్ వైపు కూడా డిజైన్‌లో పేర్కొన్న స్థాయి కన్నా దిగువకు ఆ కోత ఏర్పడి ఉంటే అక్కడ వైబ్రోస్టోన్ కాలమ్స్‌లో బంకమట్టి రేణువులు అడ్డుపడటం కాకుండా కొట్టుకుపోయి ఉండేవి కాదా అని ప్రశ్నించారు. అది వైబ్రోస్టోన్ కాలమ్స్‌కు ఎలా ఇబ్బంది కలిగించేదని శ్రీరామ్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో 2021, 2022 వరదల తర్వాత బేతమేటిక్ సర్వే ఎందుకు చేయలేదని శ్రీరామ్ ప్రశ్నించారు. గైడ్‌బండ్ మెటీరియల్‌లో బంకమట్టి రేణువులు 5 శాతం కన్నా తక్కువ ఉండాలనేది ప్రమాణం. అది నిర్మాణ నాణ్యతను నిర్దేశిస్తుంది.
రాష్ట్ర జలవనరులశాఖ, వ్యాప్కోస్ నిర్వహించిన నాణ్యత నియంత్రణ నివేదికలను సీఎస్ఎమ్ఆర్ఎస్ సీఎస్ఎమ్ఆర్ఎస్ అధ్యయనం చేయాలి. ఆ నివేదికలను సీఎస్ఎమ్ఆర్ఎస్కు నివేదించి అధ్యయనం చేయించాల్సింది రాష్ట్ర జలవనరులశాఖ. ఆ పని ఎందుకు నిర్వర్తించలేదని ఆయన కమిటీ సభ్యులను ప్రశ్నించారు.
ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ వ్యాప్కోస్ సంస్థ గైడ్‌బండ్ నిర్మాణం పూర్తయిన వెంటనే ముసాయిదా పూర్తి నివేదికను ఎందుకు సమర్పించలేదు? ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీగా ప్రతి అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి నివేదికలు ఇవ్వడం వారి బాధ్యత. అలా ఇచ్చి ఉంటే గైడ్‌బండ్ కూలిపోవడానికి ముందే వాస్తవాలు బయటకు వచ్చేవి కాదా అని శ్రీరామ్ ప్రశ్నించారు.