ETV Bharat / bharat

'అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'

దేశ ప్రజలకు ప్రధాన సేవకుడిగా ఉండడమే తన కర్తవ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన వివిధ పథకాలతో ప్రజల జీవితాలు మారాయని చెప్పారు. ఈ మేరకు 'మన్​ కీ బాత్'(Pm modi mann ki baat) కార్యక్రమంలో మాట్లాడారు.

pm modi mann ki baat
మోదీ మన్​ కీ బాత్​
author img

By

Published : Nov 28, 2021, 11:58 AM IST

Updated : Nov 28, 2021, 12:44 PM IST

అధికారంలో ఉండడం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm modi speech today) పేర్కొన్నారు. దేశ ప్రజలకు 'ప్రధాన సేవకుడి'గా వ్యవహరించడమే తన ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఈ మేరకు 83వ 'మన్ కీ బాత్'(Mann ki baat today) కార్యక్రమంలో ఆదివారం ఆయన ప్రసంగించారు.

"మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలతో ప్రజల జీవితాలు మారాయి. అది నాకెంతో సంతృప్తినిస్తుంది. నా జీవితం నుంచి నేను కోరుకున్నది కూడా అదే. అధికారంలో ఉండాలని నేనెప్పుడూ భావించను. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఆ విజయానికి 50 ఏళ్లు..

1971లో జరిగిన యుద్ధంలో పాక్​పై భారత్(Indo pak war 1971)​ విజయం సాధించి వచ్చే నెలనాటికి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. సాయుధ దళాలను మోదీ ఈ కార్యక్రమంలో స్మరించుకున్నారు. ఆనాటి యుద్ధంలో అమరులైన మన దేశ సైనికులకు నివాళి అర్పించారు.

"డిసెంబరులో వాయుసేన దినోత్సవం, సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ఈ దేశం జరుపుకోనుంది. డిసెంబరు 16నాటికి 1971 యుద్ధం జరిగి, 50 ఏళ్లు పూర్తవనుంది. ఈ సందర్భంగా నేను సాయుధ దళాలు, మన సైనికులు, వారికి జన్మనిచ్చిన తల్లులను స్మరించుకుంటున్నాను"

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

భారతీయుల పరిష్కారం..

ప్రస్తుతం.. దేశంలోని 70కిపైగా అంకుర పరిశ్రమలు(Modi about startups india) 100కోట్ల డాలర్ల క్లబ్​లో చేరాయని మోదీ పేర్కొన్నారు. ఎన్నో అంతర్జాతీయ సమస్యలకు భారతీయులు తమ అంకుర పరిశ్రమల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారని చెప్పారు.

సబ్​ కా సాత్.. సబ్​కా వికాస్​ స్ఫూర్తి అదే..

"ఉత్తర్​ప్రదేశ్​లో జాలౌన్​ జిల్లాలో నూన్ నది ఉంది. ఆ నది క్రమంగా అంతరించిపోయే దశకు చేరుకుంది. దీని వల్ల ఆ ప్రాంతంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఆ రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఆ నదిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది సబ్​కా సాత్​, సబ్​ కా వికాస్​ స్ఫూర్తికి నిదర్శనం" అని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం అదే'

ఇదీ చూడండి: mohan bhagwat news: 'దేశ విభజనకు ముఖ్య కారణం అదే'

Last Updated : Nov 28, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.