ETV Bharat / bharat

'బుద్ధుని బోధనల శక్తిని ప్రపంచం గ్రహించింది'

కరోనాతో మనావతా సంక్షోభం ఎదురవుతున్న ప్రస్తుత సమయంలో బుద్ధుడి బోధనలు ఎంతో అనుసరించదగినవని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బోధనల శక్తిని ప్రపంచమంతా గ్రహించిందని తెలిపారు.

pm modi
ప్రధాని మోదీ
author img

By

Published : Jul 24, 2021, 10:38 AM IST

కొవిడ్​ కారణంగా మానవత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. బుద్ధుడి బోధనలు ఎంతో అనుసరణీయమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బుద్దుడి మార్గాలను అనుసరిస్తూ.. క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో భారత్​ నిరూపించిందని తెలిపారు. ఆషాఢ పూర్ణిమ, ధర్మచక్ర కార్యక్రమం సందర్భంగా.. ప్రజలకు మోదీ శనివారం తన సందేశాన్ని ఇచ్చారు. విషాద సమయాల్లో. బుద్ధుని బోధనల శక్తిని ప్రపంచం గ్రహించిందని పేర్కొన్నారు మోదీ.

"బుద్ధుని బోధనలను పాటిస్తూ ప్రపంచం సంఘీభావతత్వంతో పయనిస్తోంది. ఇంటర్నేషనల్​ బుద్ధిస్ట్​ కన్ఫెడరేషన్​ చేపట్టిన ప్రార్థన సంరక్షణ విధానం ఎంతో విలువైనది. శత్రుత్వాన్ని శత్రుత్వం ద్వారా ఎదుర్కోలేం. ప్రేమ, పెద్ద మనసుతోనే దాన్ని ఓడించగలం. విషాద సమయాల్లో ప్రపంచమంతా.. ప్రేమ, సామరస్యం శక్తిని గ్రహించింది. బుద్ధడు బోధించిన ఈ పాఠాల ద్వారా.. మానవత్వం సుసంపన్నమైంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆలోచన, మాటలు, ఆచరణల మధ్య సామరస్యం ఉంటే.. బాధ నుంచి సంతోషంవైపు పయనించవచ్చని బుద్ధుడు బోధించాడని మోదీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పెగాసస్ వివాదంతో ప్రతిపక్షం సంఘటితం!

ఇదీ చూడండి: 'బోగస్‌ ఓట్లపై కఠినంగా వ్యవహరించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.