ETV Bharat / bharat

'చేతకాని వ్యక్తితో ప్రయోజనమేంటి?'.. ప్రధానిపై ఖర్గే కుమారుడి తీవ్ర విమర్శలు

author img

By

Published : May 1, 2023, 4:21 PM IST

Updated : May 1, 2023, 5:11 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఓ పనికిరాని వ్యక్తి అని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. అలాంటి వ్యక్తి ఉండటం వల్ల ఇల్లు ఎలా గడుస్తుందని వ్యాఖ్యానించారు. బంజారాల రిజర్వేషన్ విషయంలో అనేక అపోహలు ఉన్నాయని, వాటిపై ప్రధాని మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రియాంక్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఓటమి నైరాశ్యంలోనే కాంగ్రెస్ నేతలు అలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రియాంక్ చేసిన వ్యాఖ్యలు.. మోదీని ఉద్దేశించి కాదని చెప్పారు.

Priyank Kharge modi nalayak
Priyank Kharge modi nalayak

ప్రధాని నరేంద్ర మోదీ విష సర్పం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుండగా.. ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే సైతం ప్రధాని లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ పనికిరాని వ్యక్తి అని ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పని చేసే సామర్థ్యం లేని వ్యక్తి ఉంటే.. ఇల్లు ఎలా గడుస్తుందంటూ ప్రశ్నించారు. కర్ణాటకకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించగా.. ఆ వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవి కావంటూ మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు.

అసలేమైందంటే?
కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ.. తనను తాను బంజారా వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పుకున్నారని ప్రియాంక్ ఖర్గే తెలిపారు. అలాంటి ఆయన.. బంజారాలకు రిజర్వేషన్ల విషయంలో ప్రజలను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

"గుల్బర్గా(కలబురగి) వచ్చినప్పుడు మీరు(మోదీని ఉద్దేశించి) ఏం చెప్పారు? బంజారాలను ఉద్దేశించి ఏం భరోసా ఇచ్చారు? 'మీరంతా భయపడొద్దు. దిల్లీలో కూర్చున్న వ్యక్తి బంజారా పుత్రుడే' అని చెప్పుకున్నారు. గత పర్యటనలలో ప్రధాని తనను తాను కోలి వర్గానికి చెందిన పుత్రుడినని చెప్పుకున్నారు. అంతకుముందు కబ్బలిగ, కురుబ వర్గాలకు చెందిన వ్యక్తినని కూడా చెప్పుకున్నారు. ఈరోజేమో బంజారా పుత్రుడినని అంటున్నారు. పనికిరాని పుత్రుడు దిల్లీలో కూర్చుంటే ఇల్లు ఎలా నడుస్తుంది? బంజారా పుత్రుడిగా చెప్పుకొని ప్రజలను ఆయన అయోమయానికి గురిచేస్తున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి బంజారాలకు న్యాయం జరిగిందా? శికారిపురలో యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి ఎందుకు జరిగింది? కలబురగి, జెవార్గిలో బంద్ ఎందుకు పాటించారు? ప్రస్తుతం రిజర్వేషన్ల విషయంలో అయోమయం నెలకొంది."
-ప్రియాంక్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి

అయితే, తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని అన్నారు ప్రియాంక్ ఖర్గే. విమర్శలను తట్టుకోలేని వారు రాజకీయాలను వదిలిపెట్టాలని చెప్పుకొచ్చారు. రామరాజ్యాన్ని తెస్తామని చెప్పినవారు నేరస్థులకు టికెట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 'చిన్నపిల్లల పాలపొడిని దొంగలించే వ్యక్తికి మీరు చిట్టాపుర నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. దీనికి మీ(మోదీని ఉద్దేశించి) సమాధానమేంటి? రోడ్​షో కంటే ముందు మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించండి. మన్​కీ బాత్ బదులు.. జన్​కీ బాత్ కార్యక్రమం చేపట్టండి' అంటూ విమర్శలు గుప్పించారు ప్రియాంక్ ఖర్గే.

Priyank Kharge modi nalayak
ప్రియాంక్ ఖర్గే

ఓటమి నిరాశలో...
ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. తమ మాస్టర్లను (రాహుల్, సోనియాలను ఉద్దేశించి) తృప్తిపరిచేందుకే విపక్ష నేతలు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. కాంగ్రెస్ మానసికంగా దివాలా తీసిందని, మోదీకి వ్యతిరేకంగా అనుచితంగా మాట్లాడటంలో ఆ పార్టీ నేతలంతా పోటీ పడుతున్నారని బీజేపీ అధినేత జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయిందని, అందుకే ఆ పార్టీ నేతలు నిరాశలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యుండకపోతే.. ప్రియాంక్ ఏం చేసేవారో అంటూ చురకలు అంటించారు బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ.

మోదీని అనలేదు: ఖర్గే
ప్రియాంక్​ వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రియాంక్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. 'ఆ వ్యాఖ్యలు ప్రియాంక్ చేసినట్లు ప్రచారం చేయకండి. తనను అవమానించిన ఎంపీకి వ్యతిరేకంగానే ప్రియాంక్ మాట్లాడారు. వాటిని మోదీకి అన్వయించకండి. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది' అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మోదీ లక్ష్యంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విషసర్పం లాంటి వ్యక్తి అని అన్నారు. పరీక్షించాలన్న ఉద్దేశంతో ముట్టుకునేందుకు ప్రయత్నిస్తే చనిపోతారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తీవ్రంగా స్పందించారు. ఖర్గే మెదడులోనే విషం ఉందంటూ కర్ణాటక సీఎం బొమ్మై వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై మోదీ సైతం స్పందించారు. శివుడి మెడలోనూ సర్పం ఉంటుందని, అది దైవంతో సమానమని ఖర్గేకు చురకలు అంటించారు.

Last Updated : May 1, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.