ETV Bharat / bharat

భారత్​-బ్రిటన్​ సరికొత్త స్నేహగీతం- 2022లోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం! - boris johnson modi meeting

Johnson Modi: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంక్షోభాల వేళ ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవడానికి భారత్‌- బ్రిటన్‌ అంగీకరించాయి. దిల్లీలో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ద్వైపాక్షిక, రక్షణ, భద్రత అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. ఈ ఏడాది దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇవ్వాలని ఇరువురు ప్రధానులు ఓ అంగీకారానికి వచ్చారు.

Boris Johnson PM Modi
బోరిస్​ జాన్సన్​- నరేంద్ర మోదీ
author img

By

Published : Apr 22, 2022, 2:02 PM IST

Updated : Apr 22, 2022, 6:26 PM IST

Boris Johnson Modi Meeting: రెండురోజుల భారత పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. అహ్మదాబాద్‌ నుంచి దిల్లీ చేరుకున్న బోరిస్‌ జాన్సన్‌కు.. ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌లో స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద బోరిస్‌ జాన్సన్‌ నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక, ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు.

రెండు దేశాల సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు. వర్తకం, ఆర్థికం, రక్షణ, వాతావరణ మార్పులు సహా ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాల బలోపేతానికి పదేళ్ల మార్గసూచీ ఖరారు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని మోదీ, జాన్సన్‌ నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంసహా ప్రపంచవ్యాప్తంగా పలు సంక్షోభాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. ద్వైపాక్షిక, రక్షణ, భద్రత అంశాల్లో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. రెండుదేశాల సమగ్ర సంబంధాలపై సమీక్ష జరపాలని నిర్ణయం తీసుకున్నారు. శాంతియుత, భద్రతాపరమైన, సుస్థిర అఫ్గానిస్థాన్‌కు భారత్‌-బ్రిటన్‌ ప్రధానులు మద్దతు తెలిపారు. ఇతరదేశాల్లో ఉగ్రదాడులకు అఫ్గాన్‌ భూభాగం ఉపయోగించకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ జరగాలని మోదీ ఆకాంక్షించారు. అక్కడి సమస్య పరిష్కారానికి చర్చలు జరగాలన్నారు. రక్షణరంగంలో సాధికారత సాధించేందుకు బ్రిటన్‌ సాయం చేయాలని కోరారు. ఈ దశాబ్దంలో రెండు దేశాల సంబంధాలకు ఓ దిశ చూపేందుకు ఖరారైన మార్గసూచీ వృద్ధిపై శుక్రవారం నాటి భేటీలో సమీక్ష జరిపినట్లు మోదీ తెలిపారు.

''భారత్‌, బ్రిటన్‌ మధ్య గతేడాది సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ దశాబ్దంలో రెండుదేశాల సంబంధాలకు ఓ దిశ చూపేందుకు ఒక గొప్ప మార్గసూచీ 2030ని కూడా ప్రారంభించాం. ఆ మార్గసూచీ వృద్ధిపై మేం సమీక్ష జరిపాం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల బృందాలు పనిచేస్తున్నాయి. చర్చల్లో చక్కని పురోగతి కనిపిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి చేసే దిశగా పూర్తి ప్రయత్నాలు చేయాలని భారత్‌, బ్రిటన్‌ నిర్ణయించాయి.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

భారత్‌తో తమ సంబంధాలు ప్రతిరంగంలోనూ బలోపేతం అయ్యాయని బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. మోదీని తనకు ప్రత్యేకమైన మిత్రుడు అని కొనియాడారు. తన భారత పర్యటన రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లిందని బ్రిటన్‌ ప్రధాని ఆకాంక్షించారు. విస్తృత రక్షణ, భద్రతా భాగస్వామ్యానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌లో తయారీకి బోరిస్ జాన్సన్‌ మద్దతు ప్రకటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా ఉంచేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ రూపాల్లో ఎదురవుతున్న ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ఇరుదేశాలు పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

''బ్రిటన్‌, భారత్‌ మధ్య ప్రస్తుత సమయంలో చెప్పుకోదగ్గ స్నేహం ఉంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతాన్ని స్వేచ్ఛాయుతంగా, బహిరంగంగా ఉంచడంసహా మా సహకారాన్ని విస్తరించుకుంటాం. నూతన, విస్తృత రక్షణ, భద్రత భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటాం. మనిషి, సముద్రం, ఆకాశం, అంతరిక్షం, సైబర్‌ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. యుద్ధ విమానాల సాంకేతికతలో కూడ ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాం.''

- బోరిస్​ జాన్సన్​, బ్రిటన్​ ప్రధాన మంత్రి

అధికార వ్యవస్థపై ఆధారపడడాన్ని తప్పించడంసహా రక్షణ కొనుగోళ్ల సరఫరాను సులభతరం చేసేందుకు భారత్‌కు బహిరంగ ఎగుమతి లైసెన్స్‌ విధానం అమలు చేయనున్నట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: షరతుల్లేకుండా కాంగ్రెస్​లోకి ప్రశాంత్​ కిశోర్​- జగన్​తో పొత్తుకు వ్యూహం!

Last Updated : Apr 22, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.