petrol price news: పెట్రో భారం నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పించడంలో కేంద్రం బాటలోనే పయనిస్తున్నాయి పలు రాష్ట్రాలు. లీటర్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్‌పై 2.41 రూపాయలు, డీజిల్‌పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్‌పై 2.48 రూపాయలు, డీజిల్‌పై 1,36 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ట్విట్టర్లో తెలిపారు. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్, డీజిల్‌లపై సుంకాలను తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.2.08, డీజిల్‌పై లీటర్‌కు రూ. 1.44లు తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీఐపీఆర్ తెలిపింది.
మేం తగ్గించలేం: పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ టి. రాజన్ స్పందించారు. అది అసంపూర్ణమేనని విమర్శించారు. రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయని చూడటం.. న్యాయం కాదు, సమంజసమూ కాదని అన్నారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని కోరని కేంద్రం.. ఇప్పుడెందుకు పన్నులు తగ్గించాలని హితబోధ చేస్తోందని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపును పరిశీలిస్తామని అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
Petrol Excise Duty: దేశంలో నిత్యావసర వస్తువులు, సహా పెట్రోల్, డీజిల్, నిర్మాణ రంగ వస్తువుల ధరలు భారీగా పెరిగిన వేళ కేంద్ర ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించే దిశగా నిర్ణయాలు తీసుకుంది. చమురు, గ్యాస్, నిర్మాణ రంగ వస్తువులపై సుంకాలు తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయలు, డీజిల్‌పై 6 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7.. తగ్గే అవకాశం ఉంది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది.
గత ఏడాది దీపావళి సమయంలో కూడా కేంద్రం లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించింది. అప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ఇదే తరహాలో తమ వంతు పన్ను తగ్గించాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాలు స్పందించకపోగా.. పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పట్లో విజ్ఞప్తి చేశారు.
Imran khan on India petrol prices: పెట్రో సుంకాల తగ్గింపుపై భారత ప్రభుత్వం నిర్ణయాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసించారు. అగ్రరాజ్య అమెరికా ఒత్తిడిలో పడకుండా రష్యా నుంచి రాయితీపై కొనుగోలు చేయడాన్ని సమర్థించారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాంటి విధానాలనే ప్రోత్సహించాన్నారు.
ఇదీ చదవండి: 'దేశంపై భాజపా కిరోసిన్ చల్లింది.. ఒక్క నిప్పురవ్వ చాలు..'