Person Complaints Stolen Slippers: నిత్యం తీరిక లేకుండా ఉండే పోలీసులకు.. అప్పుడప్పుడు విచిత్రమైన కేసులు వస్తుంటాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ జిల్లా ఖాచ్రోడ్ పోలీస్ స్టేషన్లో ఇలాంటి ఓ కేసు నమోదైంది. రూ. 180 విలువ చేసే తన చెప్పులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు జితేంద్ర అనే వ్యక్తి. తొలుత ఇది విని కొందరు పోలీసులు నవ్వుకున్నారు. అతడు చెప్పింది విన్నాక షాకయ్యారు. చివరకు అతడి కంప్లైంట్‌ను మాత్రం స్వీకరించారు.
ఇదీ జరిగింది: జితేంద్ర తన స్నేహితుడితో కలిసి శనివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. 180 రూపాయల విలువైన నల్లటి రంగు చెప్పులను దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశాడు. అయితే.. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. ''ఒకవేళ దొంగలించిన చెప్పులను.. నిందితుడు వేరే నేరం చేసిన ప్రదేశంలో వదిలేస్తే.. నన్ను బాధ్యుడిని చేయొచ్చు. ఇదంతా చూస్తే.. ఎవరో నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందులో కుట్ర దాగుందేమో.'' అని వివరించాడు. అతడి దగ్గర సాక్ష్యాధారాలు తీసుకొని.. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. ఏ తప్పూ జరగదని జితేంద్రకు భరోసా ఇచ్చి పంపించారు.
ఇవీ చూడండి: జననాంగాలను కొరికి వ్యక్తి హత్య.. షాక్‌లో పోలీసులు!
'జై భీమ్' తరహా ఘటన.. లాకప్ డెత్ కేసులో పోలీసులు అరెస్టు
ఫ్లైఓవర్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్.. తుపాకులు పేల్చుతూ హల్చల్