ETV Bharat / bharat

పేటీఎం లేదు.. అయినా ఆ పేరుతో రూ.20వేలు కట్​! కొత్త మోసం గురూ!! - cyber crime cases in india 2022

సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నయా పంథాల్లో డబ్బు దోచుకుంటున్నారు. ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.20వేలు కాజేశారు. అతడికి అసలు పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బు కొట్టేయడం విశేషం.

paytm fraud cases
పేటీఎం లేదు.. అయినా ఆ పేరుతో రూ.20వేలు కట్​! కొత్త మోసం గురూ!!
author img

By

Published : May 26, 2022, 3:37 PM IST

పేటీఎం ఖాతా లేకపోయినా.. ఆ పేరుతో డబ్బులు కాజేసిన ఘటన కేరళలో చర్చనీయాంశమైంది. రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్​ చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.. ఏం చేయాలా అని తలపట్టుకుంటున్నారు.

ఏం జరిగింది?
అనీస్​ రహ్మాన్.. కేరళ మలప్పురం జిల్లా వండూర్ వాసి. బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది. దాదాపు రూ.20వేల రూపాయలు విత్​డ్రా అయినట్లు తెలిసింది. వెంటనే అతడు బ్యాంకుకు వెళ్లి.. ఏం జరిగిందని ఆరా తీశాడు. మూడు సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదని, ఈ బ్యాంకు ఖాతాతో లింక్ కాలేదని అనీస్ చెప్పాడు. ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు.

ఇలాంటి కేసు రావడం తమకు తొలిసారని బ్యాంకు అధికారులు చెప్పారు. యూపీఐ సంబంధిత వివాదాలన్నీ బ్యాంకు ఐటీ విభాగం పరిశీలించి, నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సాంకేతిక సమస్యలతో నగదు బదిలీ జరిగి ఉంటే.. తిరిగి ఇచ్చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అయితే.. ఈ వ్యవహారం మోసపూరితంగా కనిపిస్తున్నందున.. సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు ఈ మోసానికి ఎలా పాల్పడి ఉంటారా అని అధికారులు, పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఇలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. తొలుత ఒక్క రూపాయి మాత్రమే బదిలీ చేసి, ఆ తర్వాత రూ.9999, మూడోసారి రూ.8635 ట్రాన్స్​ఫర్​ చేసినట్టుగా ఉన్న స్టేట్​మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.