ETV Bharat / bharat

'కాంగ్రెస్ అంటే.. ఐ నీడ్ కమీషన్ పార్టీ!' - రఫేల్ ఒప్పందంలో అవినీతి

2007-2012 మధ్య రఫేల్​ ఒప్పందం(Rafale Deal News) విషయంలో కాంగ్రెస్​ అవినీతికి పాల్పడిందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర(Sambit Patra) ఆరోపించారు. ఫ్రాన్స్ మీడియా ప్రచురించిన కథనమే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్​(ఐఎన్​సీ) అంటే "ఐ నీడ్ కమీషన్" పార్టీ అని విమర్శించారు. మరోవైపు.. రఫేల్​ ఒప్పందం విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడటంలో వెనుకడగు వేయొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News) తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

sambit patra
సంబిత్ పాత్ర
author img

By

Published : Nov 9, 2021, 2:38 PM IST

రఫేల్​ ఒప్పందంలో(Rafale Deal News) అవకతవకలకు ఆధారాలు ఉన్నాయంటూ ఫ్రెంచ్ మీడియా ప్రచురించిన కథనంతో దేశంలో మళ్లీ రాజకీయ వేడి రగులుకుంది. అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్​ పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. రఫేల్(Rafale Deal News) యుద్ధ విమానాల ఒప్పందంలో కాంగ్రెస్​ పార్టీ అవినీతికి పాల్పడిందని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర(Sambit Patra) ఆరోపించారు. 2007-2012 మధ్య ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సాగించిందని చెప్పారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్​సీ) అంటే 'ఐ నీడ్​ కమీషన్' అని విమర్శించారు. ఈ మేరకు దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన(Sambit Patra) మాట్లాడారు.

"2019 ఎన్నికలకు ముందు రఫేల్​(Rafale Deal News) ఒప్పందం వ్యవహారంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ.. రఫేల్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని భావించింది. ఈ రోజు మీ ముందు కొన్ని కీలకమైన పత్రాలను పెడుతున్నాం. ఎవరి హయాంలో అవినీతి జరిగిందో ఆ పత్రాలు చెబుతాయి. రఫేల్​ ఒప్పందంలో అవినీతి జరిగిందని ఫ్రెంచ్​ మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. ఈ వ్యవహారం అంతా 2007 నుంచి 2012 మధ్య జరిగింది."

-సంబిత్ పాత్ర, భాజపా జాతీయ అధికార ప్రతినిధి

"నా అభిప్రాయంలో.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్​(ఐఎన్​సీ) పేరును 'ఐ నీడ్​ కమిషన్'​ అని మార్చాలి" అని సంబిత్ పాత్ర(Sambit Patra) విమర్శించారు.

"2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఎన్ని అవాస్తవాలను ప్రచారం చేశారో మనమంతా చూశాం. భాజపా, ప్రధాని మోదీపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. కాంగ్రెస్ ఎన్నో పత్రికా సమావేశాలను నిర్వహించింది. రఫేల్ అంటే ఓ కమీషన్లకు సంబంధించిన ఓ కథ. భారత్​తో రఫేల్​ ఒప్పందం కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్​ ఓ మధ్యవర్తికి 7.5మిలియన్​ యూరోలు(రూ.65 కోట్లు) ముడుపులు చెల్లించిందని ఫ్రెంచ్ మీడియా తన కథనంలో తెలిపింది. ఆ మధ్యవర్తి పేరు ఎస్​ఎం గుప్తా. ఆగస్టా వెస్ట్​ల్యాండ్ కేసులోనూ ఆయన పేరు ఉంది. ఇదేదో కాకతాళీయంగా జరిగినదైతే కాదు.. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది."

"రాహుల్​ గాంధీ ప్రస్తుతం బహుశా ఇటలీలో ఉండి ఉంటారు. అక్కడి నుంచే యూపీఏ హయాంలో ఈ అవినీతి ఎలా జరిగిందో ఆయన సమాధానమివ్వాలి" అని సంబిత్ పాత్ర(Sambit Patra) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​ రెండు ముఖాల పార్టీ అని విమర్శించారు.

'భయపడవద్దు.. అలసిపోవద్దు'

మరోవైపు.. ఫ్రెంచ్ మీడియా కథనం నేపథ్యంలో కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi News).. ట్విట్టర్​ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఎవరూ భయపడవద్దని తమ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

"ప్రతి అడుగులో నిజం మీ వైపే ఉన్నప్పుడు ఇక భయపడడం ఎందుకు? కాంగ్రెస్ కార్యర్తలారా.. కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉండండి. ఆగవద్దు, అలిసిపోవద్దు, భయపడవద్దు" అని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

రఫేల్​పై మళ్లీ దుమారం- లంచాలపై కీలక ఆధారాలు బహిర్గతం!

'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుపాలు'

రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.