ETV Bharat / bharat

విద్యార్థులతో కలిసి బడికి వెళ్తున్న చిలుక- వీడియో వైరల్​! - పిల్లలతో పాఠశాలకు వస్తు్న్న చిలక

మనుషులకు, పక్షులకు మధ్య అనుబంధం ఈనాటిది కాదు. మన మాటలు, చేష్టలను అర్థం చేసుకుంటూ ఎప్పటి నుంచో అవి మన జీవితంలో భాగమయ్యాయి. ముఖ్యంగా చిలుకలు అంటే ఇష్టపడనివారు ఎవ్వరూ ఉండరు. మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌ జిల్లాలో చిన్నారులు ఒక చిలుకతో ( Gwalior school Parrot ) స్నేహం చేస్తున్నారు. అపురూపమైన చిలుక-విద్యార్థుల దోస్తీ ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Parrot in Gwalior loves to spend time with children
విద్యార్థులతో కలిసి బడికి వెళ్తున్న చిలక
author img

By

Published : Oct 2, 2021, 6:45 PM IST

విద్యార్థులతో కలిసి బడికి వెళ్తున్న చిలుక

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని శారదా బల్‌గ్రామ్ అటవీ ప్రాంతం. అక్కడికి సమీపంలోనే ఓ పాఠశాలలో చదువుకోవడానికి అనేక మంది విద్యార్థులు ఉదయం వస్తారు. సాయంత్రం బడి ముగియగానే తిరిగి వెళ్తుంటారు. ఒక చిలుక కూడా వారిని అనుసరిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.

Gwalior school Parrot
విద్యార్థి తలపై ఉన్న చిలుక

పిల్లలను బడిలో వదిలి వెళ్లేందుకు తల్లిదండ్రులు వచ్చి వెళ్లినట్లు రోజూ ఉదయం విద్యార్థుల వెంట ఆ చిలుక (Gwalior school Parrot) కూడా పాఠశాలకు వస్తుంది. వారు బడిలోకి వెళ్లగానే సమీపంలోని కొండల్లోకి ఎగిరిపోతుంది. సాయంత్రం బడి గంట మోగగానే మళ్లీ వస్తుంది.

Gwalior school Parrot
విద్యార్థితో పాటు పాఠశాలకు వస్తున్న చిలుక

వారి భుజాలపైనా, తలపైనా కూర్చుని ఆడుతూ హాస్టల్‌కు వెళ్తుంది. వారితో కలిసి తింటుంది, ఆడుకుంటుంది. చాలా రోజుల నుంచి చిలుక దినచర్య ఇదేనని అక్కడి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Gwalior school Parrot
తల మీద చిలుకతో విద్యార్థులు

"చిలుక రావడం వల్ల మాకు ఎంతో బాగా అనిపిస్తుంది. మాతో పాటు పాఠశాలకు వస్తుంది. సెలవు ఉంటే మాతోనే ఉంటుంది. పాఠశాల ముగియగానే సాయంత్రం వచ్చి మాతో ఆడుకుంటుంది. ఆ తర్వాత వెళ్లిపోతుంది."

--వివేక్, విద్యార్థి

"చాలా రోజుల నుంచి మేం కూడా ఆ చిలుకను గమనిస్తున్నాం. అది పిల్లలతో ఉంటుంది, భోజనం చేస్తుంది, పాఠశాలకు వెళుతుంది, తిరిగి వస్తుంది. రాత్రి సమయంలో చెట్లపైకి వెళుతుంది. పిల్లలు హాస్టల్‌కు వెళతారు. పిల్లలకు సంబంధించి పనుల్లో చిలుక భాగస్వామి అవుతుంది. పిల్లలకు పాఠశాల సెలవు ఉంటే చిలుక వారితోనే ఉంటుంది."

- ఉపాధ్యాయుడు

చిలుక-విద్యార్థుల మధ్య దోస్తీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Gwalior school Parrot
విద్యార్థితో పాటు బడి వచ్చిన చిలుక

ఇదీ చూడండి: అక్కడ కిలో ఉప్పు రూ.130, నూనె రూ.300

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.