ETV Bharat / bharat

Parliament Session Sine Die : షెడ్యూల్​కు ముందే పార్లమెంట్ నిరవధిక వాయిదా.. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదం పొందాకే.. - పార్లమెంట్​ నిరవధిక వాయిదా

Parliament Session Sine Die : ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిర్దేశిత షెడ్యూల్​కు ఒక రోజు ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి.

Parliament Special Session 2023
Parliament Special Session 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 6:43 AM IST

Updated : Sep 22, 2023, 10:50 AM IST

Parliament Session Sine Die : చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్​కు ఒకరోజు ముందుగానే రాజ్యసభను.. సభాపతి జగదీప్ దన్‌ఖడ్‌ నిరవధికంగా వాయిదా వేశారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఈ చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించగా.. ఈ బిల్లును సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతుగా 215 మంది ఓటు వేసి ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఛైర్మన్​ జగదీప్ దన్​ఖడ్​.. హిందూ క్యాలెండర్​ ప్రకారం ప్రధానమంత్రి పుట్టినరోజు కావడం యాధృచికమన్నారు.

  • #WATCH | " It is only a coincidence...as per Hindu calendar, today is Prime Minister Narendra Modi's birthday", says Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar pic.twitter.com/NLjD26kZiS

    — ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోక్​సభ నిరవధిక వాయిదా
అంతకుముందు లోక్‌సభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. చంద్రయాన్​ 3 విజయంపై తీర్మానం అనంతరం లోక్​సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. సభ దాదాపు 31 గంటల పాటు జరగగా.. 132 శాతం ఉత్పాదకతను నమోదు చేసిందని ఓం బిర్లా తెలిపారు. సెప్టెంబర్​ 19న సభ ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై 9 గంటల 57 నిమిషాల పాటు చర్చ జరిగిందని వెల్లడించారు. ఈ చర్చలో 32 మంది మహిళా ఎంపీలు సహా 60 మంది పాల్గొన్నారని వివరించారు.

మోదీ నడిచి వస్తుండగా ఇరువైపులా నిలబడి మహిళా ఎంపీల ధన్యవాదాలు
మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడం... దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో కీలక ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ బిల్లు కేవలం చట్టం కాదన్న ప్రధాని.. ఇది మన దేశాన్ని తయారు చేసిన అసంఖ్యాక మహిళలకు నివాళి అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్టీలకు అతీతంగా "నారీ శక్తి వందన్ అధినియమ్‌" బిల్లుకు ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత.. పార్లమెంట్ భవనం వెలుపల మహిళా ఎంపీలతో ప్రధాని ఫొటో దిగారు. మోదీ నడుస్తూ వస్తుండగా.. మహిళా ఎంపీలు ఇరువైపులా నిలబడి చప్పట్లు కొట్టారు. రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆమోదం పొందడం పట్ల బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన నేతలు.. లింగ సమానత్వం, సమ్మిళిత పాలన అనే శక్తిమంతమైన సందేశాన్ని ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా పంపారని అన్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం వల్ల బీజేపీ ఎంపీ రామ్ మోకారియా మిఠాయిలు పంచారు.

  • Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.

    It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.

    With the passage of the Nari… pic.twitter.com/et8bukQ6Nj

    — Narendra Modi (@narendramodi) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Women Reservation Bill 2023 : సెప్టెంబర్‌ 19వ తేదీన.. లోక్​సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మహిళా రిజర్వేషన్​ బిల్లును ప్రవేశపెట్టారు. బుధవారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు.

Women Reservation Bill In Parliament : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

Women Reservation Bill : మహిళా రిజర్వేషన్​ బిల్లుకు పార్లమెంట్​ పచ్చ జెండా.. నెక్స్ట్​ ఏంటి?.. అభ్యర్థులను ఖరారు చేసేయడమేనా?

Last Updated : Sep 22, 2023, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.